Last Updated:

Pawan Kalyan : చంద్రబాబుకు సంఘీభావంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..

ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు కావడం ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలోనే అదే రోజు పవన్ కళ్యాణ్.. విజయవాడ రావాల్సి ఉండగా ఆయన విమానానికి అనుమతించవద్దని

Pawan Kalyan : చంద్రబాబుకు సంఘీభావంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..

Pawan Kalyan : ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు కావడం ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలోనే అదే రోజు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. విజయవాడ రావాల్సి ఉండగా ఆయన విమానానికి అనుమతించవద్దని పోలీసులు ఎయిర్ పోర్టుకు లేఖ రాశారు. దాంతో ఆయన ఫ్లైట్‌లో విజయవాడ రాలేకపోయారు. రోడ్డు మార్గం ద్వారా వస్తూంటే ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆయనను అదుపులోకి తీసుకుని తామే స్వయంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో వదిలి పెట్టారు.

చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని.. కుట్ర పూరితంగా ఈ చర్యలు తీసుకున్నారని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాజాగా ఈ క్రమంలో ములాఖత్ లో చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున పవన్.. ప్రభుత్వం కుట్ర పూరిత అరెస్టును ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. అదే రోజు ఆయన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన రోజున మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేబినెట్ భేటీలో ఆమోదించి.. చట్టబద్దంగా ఖర్చు పెట్టిన ఓ వ్యవహారంలో ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేశారని.. తాము వచ్చాక ఎలా వైకాపా వారిని వదిలి పెడతామని హెచ్చరించారు.

అయితే పవన్ తో పాటు నారా లోకేష్ కూడా ములాఖత్ లో ఉంటారో ఉండరో అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల నారా లోకేష్ కూడా.. తాను అన్నలాగా భావించే పవన్ కళ్యాణ్ వారికి అండగా ఉన్నారని.. మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.