Published On:

IPL 2025: నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా.. కొత్త జెర్సీతో బరిలోకి బెంగళూరు!

IPL 2025: నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా.. కొత్త జెర్సీతో బరిలోకి బెంగళూరు!

Rajasthan Royals vs Royal Challengers Bengaluru and Delhi Capitals vs Mumbai Indians: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 28 వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో బెంగళూరు 5 మ్యాచ్‌లు ఆడగా.. 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. అలాగే రాజస్థాన్ ఆడి 5 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.

 

అయితే, ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కొత్త జెర్సీ ధరించనుంది. ఆర్సీబీ తమ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గతంలో మాదిరిగా గ్రీన్ కలర్ జెర్సీతో మైదానంలోకి అడుగుపెట్టనుంది. పర్యావరణం రక్షించడంతో పాటు చెట్లను నాటే లక్ష్యంతో ఆర్సీబీ గ్రీన్ జెర్సీ ధరిస్తున్న విషయం తెలిసిందే.

 

మరోవైపు, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు 29వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఇప్పటివరకు ఢిల్లీ ఆడిన 4 మ్యాచ్‌లు ఆడగా.. 4 విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ముంబై ఆడిన 5 మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్థానానికి పరిమితమైంది.