Vivo V40e 5G Discounts: ఈ స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ.3,500 డిస్కౌంట్.. పూర్తి వివరాలివే ఇవిగో..!

Vivo V40e 5G Discounts: Vivo V50e 5G ఫోన్ భారతదేశంలో విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ. 28,999. ఈ మొబైల్ రాకతో కంపెనీ Vivo V40e 5G మొబైల్ రేటు బాగా తగ్గింది. ఈ వివో 5G ఫోన్ కూడా రూ.28,999కి లాంచ్ అయింది, కానీ ఇప్పుడు డిస్కౌంట్లు, ఆఫర్లతో కేవలం రూ.25,499కే కొనుగోలు చేయచ్చు. ఇందులో 6.77-అంగుళాల 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
Vivo V40e 5G Offers
Vivo V40e 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.28,999 కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ ఈ 5G ఫోన్‌ను రూ. 2,000 తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత దీని ధర రూ. 26,999కి చేరుకుంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై రూ.2,000 తగ్గింపుతో పాటు రూ.1,500 క్రెడిట్ కార్డ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి EMI చేయడంపై రూ. 1,500 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీని తర్వాత 8జీబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.25,499 అవుతుంది. ఈ విధంగా, రూ.28,999కి లాంచ్ అయిన ఫోన్‌ను రూ.3,500 తగ్గింపుతో రూ.25,499కి కొనుగోలు చేయచ్చు. బ్యాంక్ ఆఫర్ ఈ నెల చివరి తేదీ, ఏప్రిల్ 30 వరకు ఉంటుంది.
Vivo V40e Features And Specifications
వివో V40e ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14 పై రన్ అవుతుంది. ఈ 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని క్లాక్ స్పీడ్ 2.5GHz. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ అందించారు. ఈ టెక్నాలజీ ఫోన్ 8జీబీ ఫిజిరకల్ ర్యామ్‌కి 8జీబీ వర్చువల్ ర్యామ్‌ని జోడిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 2392 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.77-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 3D కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1300నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Vivo V40e Camera
వివో V40e 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాకు సపోర్ట్ ఇస్తుంది, ఇది F/2.0 ఎపర్చరుపై పనిచేస్తుంది. ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ F/1.79 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్‌ను కలిగి ఉంది, ఇది F/2.2 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్‌తో కలిసి పనిచేస్తుంది.
Vivo V40e Battery
వివో V40e 5G ఫోన్ 5,500 mAh బ్యాటరీకి సపోర్ట్ ఇస్తుంది. ఇది 15 గంటల 51 నిమిషాల PCMark బ్యాటరీ స్కోర్‌ను సాధించింది. ఈ పెద్ద బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు, 42 నిమిషాల్లో ఫోన్‌ను 20శాతం నుండి 100శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.