‘Adhi Dha Surprisu’ Song Out: కాంట్రవర్సీ సాంగ్ ‘అదిదా సర్‌ప్రైజ్’.. స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్!

Robinhood Movie ‘Adhi Dha Surprisu’ Full Video Song Released: టాలీవుడ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఇందులో నితిన్ సరసన శ్రీలీల నటించింది. అయితే ఈ సినిమా చిత్రంలోని ప్రత్యేక సాంగ్ ‘అదిదా సర్‌ప్రైజ్’ కాంట్రవర్సీగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సాంగ్‌లో కేతికా శర్మ నటించింది.
తాజాగా, ఈ సాంగ్‌పై మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌పై కొన్ని స్టెప్పుల విషయంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పలు మార్పులు చేసి థియేటర్స్‌లో విడుదల చేశారు. మేకర్స్ అదే వెర్షన్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్స్‌లో విడెదలైంది. కంటెంట్ సరిగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ సంగీతం అందించగా.. రాజేంద్ర ప్రసాద్,వెన్నెల కిశోర్, మైమ్ గోపి, షైన్ టామ్ చాకూ, బ్రహ్మాజీ నటించారు. ఈ సినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించాడు. అయితే ఆయన క్రికెటర్‌గా చేసిన కెమియో సరదాగా అనిపించింది. కానీ స్టోరీకి తగిన విధంగా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.
ఇదిలా ఉండగా, ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ వివాదంగా మారింది. ఈ పాటను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సాంగ్‌పై తీవ్రంగా విమర్శలు రావడంతో స్టెప్‌ను తొలగించారు. అయితే, ఇవాళ రిలీజ్ చేసిన వీడియో సాంగ్‌లో వివాదాస్పదంగా మారిన ఆ స్టెప్పు కనిపించకుండా చేశారు. ఈ సాంగ్‌లో ఆ స్టెప్పు ఉందో లేదో తెలుసుకునేందుకు ప్లే బటన్ క్లిక్ చేసి మీరూ చూడండి.