Published On:

Samsung Galaxy Z Fold 7: మతడ ఫోన్.. వెరైటీని కోరుకునే వారి కోసం.. సామ్‌సంగ్ ఫోల్డ్ వచ్చేస్తోంది..!

Samsung Galaxy Z Fold 7: మతడ ఫోన్.. వెరైటీని కోరుకునే వారి కోసం.. సామ్‌సంగ్ ఫోల్డ్ వచ్చేస్తోంది..!

Samsung Galaxy Z Fold 7: సామ్‌సంగ్ త్వరలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ గత సంవత్సరం గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మోడల్‌కు సక్సెసర్. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు మళ్లీ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ కొత్త బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఆండ్రాయిడ్ 16 తో పాటు సామ్‌సంగ్ One UI 8 స్కిన్‌తో కూడా రావచ్చు. జనవరిలో ప్రారంభించిన గెలాక్సీ S25 సిరీస్ లాగానే, సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ను కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో పవర్ చేస్తుందని భావిస్తున్నారు.

 

Samsung Galaxy Z Fold 7 Specifications
ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 మొబైల్ 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ప్రస్తుత సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మోడల్‌లో 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది అప్‌గ్రేడ్ చేసిన అండర్ డిస్ప్లే కెమెరాను కూడా కలిగి ఉందని చెబుతున్నారు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7లో 8-అంగుళాల లోపలి స్క్రీన్ లేదా 6.5-అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించవచ్చు. ఇది గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6లో ఉపయోగించిన 7.6-అంగుళాల, 6.3-అంగుళాల ప్యానెల్‌ల కంటే పెద్దది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం రాబోయే స్మార్ట్‌ఫోన్ ‘కొత్త లేయర్’ లోపలి స్క్రీన్‌పై చిన్న క్రీజ్‌తో మరింత మన్నికైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

 

సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఓపెన్ చేసినప్పుడు 4.5మిమీ మందం ఉంటుందని చెబుతున్నారు. అంటే ఇది దాని ముందున్న దాని కంటే దాదాపు 1.1మిమీ సన్నగా ఉండచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుందని లీక్ పేర్కొంది. గెలాక్సీ S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో వచ్చిన అదే కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ ఇందులో కూడా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ అప్‌గ్రేడ్ చేసిన స్పీకర్లు, కొత్త వైబ్రేషన్ మోటారుతో వస్తుందని భావిస్తున్నారు.

 

Samsung Galaxy Z Fold 7 Launch Date
2025 రెండవ త్రైమాసికం నాటికి ఆండ్రాయిడ్ 16ని విడుదల చేయాలనే గూగుల్ ప్రణాళిక కారణంగా, అర్హత కలిగిన గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ నాటికి అప్‌డేట్‌ను అందుకునే అవకాశం ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 జూలైలో లాంచ్ అవుతుందని లీక్స్ చెబుతున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా One UI 8 తో వస్తుందని పేర్కొన్నారు.