Last Updated:

Nara Lokesh : రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన నారా లోకేష్.. ఏం చెప్పారంటే ?

స్కిల్ డెవలప్ మెంటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతో ఆయన తనయుడు, తెదేపా కీలక నేత బాబుకు బెయిల్ కోసం పోరాడుతూనే.. మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు పార్టీల అగ్ర నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి

Nara Lokesh : స్కిల్ డెవలప్ మెంటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతో ఆయన తనయుడు, తెదేపా కీలక నేత బాబుకు బెయిల్ కోసం పోరాడుతూనే.. మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు పార్టీల అగ్ర నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన అరాచకాలమయం అని, విపక్షాలను అణచివేస్తున్నారని లోకేశ్ రాష్ట్రపతికి వివరించారు. ఈ సమావేశంలో లోకేశ్ పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు.