Delhi Assembly Elections 2025: ఢిల్లీలో ఓటింగ్ ప్రారంభం.. 9 గంటల వరకు ఎంత శాతమంటే?
Voting Begins For Delhi Assembly Elections 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ, కేంద్రమంత్రి జై శంకర్‌తో పాటు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది.
కాగా, ఢిల్లీలో 1.56కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.