Last Updated:

Waheeda Rehman: వహీదా రెహ్మాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వహీదా 1972లో పద్మశ్రీ, 2011 లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.

Waheeda Rehman: వహీదా రెహ్మాన్ కు  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Waheeda Rehman: ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వహీదా 1972లో పద్మశ్రీ, 2011 లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ‘గైడ్,’ ‘ప్యాసా,’ ‘ఖామోషి’, ‘కాగజ్ కే ఫూల్,’ మరియు ‘చౌద్విన్ కా చాంద్ తదితర చిత్రాల్లో తన నటనతో వహీదా రెహమాన్ ప్రశంసలు పొందారు. పలు హిందీ చిత్రాల్లో నటించిన వహీదా తన భర్త దివంగత నటుడు కమల్జిత్ మరణించిన తరువాత పిల్లలతో కలిసి ముంబయ్ లో నివసిస్తున్నారు.

అంకితభావం.. నిబద్దత..(Waheeda Rehman)

ఇలాఉండగా వహీదా రెహమాన్ కు అవార్డు లభించడంపై అనురాగ్ ఠాకూర్ సామాజిక మాధ్యమం Xలో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. వహీదా రెహమాన్ జీ భారతీయ సినిమాకు ఆమె చేసిన అద్భుతమైన సేవలకు గాను ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేస్తున్నట్లు ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వహీదా జీ హిందీ చిత్రాలలో ఆమె చేసిన పాత్రలకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది, ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదవి కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషి తదితర చిత్రాల్లో ఆమె తన పాత్రలతో మెప్పించారు. 5 దశాబ్దాలుగా సాగిన తన కెరీర్‌లో, ఆమె తన పాత్రలను అత్యంత నైపుణ్యంతో పోషించింది. పద్మశ్రీ మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన వహీదా జీ అంకితభావం, నిబద్ధత మరియు భారతీయ నారి యొక్క బలానికి ఉదాహరణ. ఆమె తన కృషితో అత్యున్నత స్థాయి వృత్తి నైపుణ్యాన్ని సాధించారు. చారిత్రక నారీ శక్తి వందన్ అధినియం పార్లమెంటు ఆమోదించిన తరుణంలో, ఆమెకు ఈ జీవితకాల సాఫల్య పురస్కారం లభించడం భారతీయ చలనచిత్ర ప్రముఖ మహిళల్లో ఒకరికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఠాకూర్ అన్నారు.