Kadapa SP Anburajan: సెల్ ఫోన్ల కంటైయినర్ దొంగలు అరెస్ట్.. కడప ఎస్పీ అన్బురాజన్
కడప నగరంలో సంచలన సృష్టించిన సెల్ ఫోన్ల కంటైనర్ దొంగతనం కేసును పోలీసులు ఛేధించారు. ఈ కేసులో కోట్ల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను రికవరీ చేశారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట చేశారు.
Kadapa: కడప నగరంలో సంచలన సృష్టించిన సెల్ ఫోన్ల కంటైనర్ దొంగతనం కేసును పోలీసులు ఛేధించారు. ఈ కేసులో కోట్ల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను రికవరీ చేశారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట చేశారు.
వివరాల్లోకి వెళ్లితే, హరియాణా నుండి చెన్నైకు సెల్ ఫోన్లును తరలిస్తున్న ఓ కంటైనర్ ను కడప శివారులో గత నెల 23న అపహరించారు. రూ. 1.68కోట్లు విలువచేసే మొబైల్ ఫోన్లను దొంగలు తస్కరించారు. ఈ నేపథ్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు దొంగలను పట్టుకొనేందుకు వేటలో పడ్డారు. కర్ణాటకు చెందిన మన్సూర్ అహ్మద్, రెహమాన్ షరీష్ లు ఇద్దరు అంతరాష్ట్రాల దొంగలు పోలీసులకు చిక్కారు. వారి నుండి రూ. 1.68కోట్ల విలువచేసే మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. దోపిడీలో మరో నలుగురు ఉన్నారని, అయితే వారు పరారీలో ఉన్నట్లు ఎస్పీ అన్బురాజన్ విలేకర్ల సమావేశంలో తెలిపారు. గత నెల 23న జరిగిన సంఘటనలో 30న కడప చిన్న చౌక్ పోలీసులకు బ్లూడార్ట్ కొరియర్ సంస్ధ ఫిర్యాదు చేసిన క్రమంలో పోలీసులు నిందుతలను పట్టుకొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: మీర్ పేట్ లో బాలిక పై గ్యాంగ్ రేప్.. పరారీలో నిందితులు