Published On:

Deputy CM Pawan Kalyan: రాష్ట్రంలో మరో వినూత్న కార్యక్రమం.. మన ఊరు-మాటామంతీతో సమస్యలు పరిష్కారం!

Deputy CM Pawan Kalyan: రాష్ట్రంలో మరో వినూత్న కార్యక్రమం.. మన ఊరు-మాటామంతీతో సమస్యలు పరిష్కారం!

Deputy CM Pawan Kalyan Inaugurated ‘Mana Ooru – MataManthi’ Program: రాష్ట్రంలో మరో వినూత్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం చుట్టారు. ‘మన ఊరు-మాటామంతీ’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో మాట్లాడనున్నారు. వెండితెర వేదికగా మన ఊరు-మాటామంతీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టెక్కలిలోని థియేటర్ వేదిక కానుంది. ఈ మేరకు ప్రజల సమస్యలు తెలుసుకొని, అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వనున్నారు.

 

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఫలిస్తోంది. తొలి రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రజలతో పవన్ కల్యాణ్ ముఖాముఖిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలస ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా మారింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.