Burn Belly Fat: ఉదయాన్నే ఒక గ్లాస్ సాల్ట్ వాటర్… ఈ సింపుల్ చిట్కాలతో బెల్లీ ఫ్యాట్‌కి చెక్ పెట్టండి!
Simple Morning Habits to Burn Belly Fat: ఇటీవల కాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ (belly fat) సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువ శాతం ఆఫీసులో కూర్చోని వర్క్ చేయడం వల్ల పొట్టపెరిగిపోతుంది. ఈ బిజీ లైఫ్, ఆహారపు అలవాట్ల వల్ల బెల్లి ఫ్యాట్ పెరిగిపోతుంది. దీనివల్ల అసౌకర్యానికి లోనవుతుంటారు. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. పది మందిలోనూ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. పొట్ట తగ్గించుకోవడానికి చాలమంది నోర్లు కట్టేసుకుంటారు.
తమకు ఇష్టమైన ఆహారం తినకుండ డైట్ చేస్తుంటారు. మరికొందరు జిమ్‌లో కష్టపడిపొడుతుంటారు. అయినా బెల్లీ ఫ్యాట్ తగ్గడం బాధపడుతుంటారు. అ లాంటి వారు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. వీటిని ప్రతి రోజు ఫాలో అవ్వడం వల్ల పొట్ట తగ్గడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకి అవేంటో ఇక్కడ చూద్దాం!
సాల్ట్ వాటర్
ఉదయం లేవగానే చాలా మంది గ్లాస్ హాట్ వాటర్ తాగుతారు. అయితే అందులో కాస్తా ఉప్పు కూడా వేసుకని తాగితే మరి మంచిదని చెబుతున్నారు. ఇలా రోజు ఉదయం లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్‌లో ఉప్పు కలుపుకుని తాగడం వల్ల మెటబాలీజం పెరుగుతుంది. మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ఇది హెల్ప్ చేస్తుందట. జీవక్రియ పనితీరును మెరుగుపరిస్తుంది. కాబట్టి జీవక్రియ పనితీరు ఎక్కువగా ఉన్నప్పుడు క్యాలరీలు చాలా ఫాస్ట్‌గా కరిగిపోతాయి. దీనివల్ల కొవ్వు తగ్గుతుంది. అలా మీ బెల్లీ ఫ్యాట్ మెల్లిమెల్లిగా కరిగి పొట్ట తగ్గుతుంది.
ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్
ఉదయం ఫస్ట్ మీల్ ఎంత హెల్తీ అయితే ఆరోగ్యానికి అంత మంచింది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదు. ఉదయాన్నే హెల్తీ ఫుడ్‌ని శరీరానికి అందించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానికోసం మీరు ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. గుడ్లు, పెరుగు (Yogurt), ప్రోటీన్ షేక్ వంటివి బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ ఆప్షన్. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఉండవు. సమయం కానీ సమయంలో తీసుకునే ఫుడ్‌ని తగ్గుతుంది. ప్రోటిన్ బ్రేక్ ఫాస్ట్ వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. వయసు ప్రభావం వల్ల కండరశక్తి తగ్గుతుంటే దానిని బిల్డ్ చేయడంలో ప్రోటీన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇది శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి మజిల్ని బిల్డ్ చేస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి
అలాగే మీ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి. ఇది బరువు తగ్గడం మాత్రమే కాదు మీ బెల్లీ ఫ్యాట్‌ని కూడా తగ్గిస్తుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు ఎంచుకోండి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, ఉబ్బరం, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.
20 నిమిషాల వ్యాయమం
ప్రతి రోజు వ్యాయమం చేయాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందుకోసం తప్పనిసరిగా జిమ్‌కి వెళ్లాల్సిన పనిలేదు. డేలో ఓ 20 నిమిషాలు ఇంట్లో వ్యాయమం చేస్తే చాలు. దీనికి వల్ల శరీరం యాక్టివ్ అవుతుంది. తేలికపాటి వ్యాయామాలు చేసినా మంచి ఫలితం ఉంటుంది. కేలరీలు తగ్గడమే కాదు.. మెటబాలీజం పెరుగుతుంది.
మెడిటేషన్
దీర్ఘకాలిక ఒత్తిడి బరువు పెరగేలా చేస్తుంది. ముఖ్యంగా బెల్లి చూట్టూ ఫ్యాట్ పెరుకుపోతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ దినచర్యలో కాసేపు మెడిటేషన్ చేయండి. దీనివల్ల ఓత్తిడి స్థాయిలు తగ్గుతాయి. హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. ప్రతి ఉదయం కొన్ని నిమిషాల మెడిటేషన్ చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్‌ని కరిగిస్తుంది.
ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్..
మీరు తినే ఫుడ్‌పై ఫోకస్‌గా ఉండాలి. ఏం తింటే మీ ఆరోగ్యానికి మంచిది అనేది గమనించుకోవాలి. ఎందుకంటే మనం ఎంత హెల్తీ ఫుడ్ తింటే ఆరోగ్యానికి అంత మంచిది. ఏ ఫుడ్ తింటే మీ హెల్త్‌కి మంచిది. వేటిలో పోషకాలు ఉంటాయి. ఏ ఫుడ్స్ తింటే అన్‌హెల్తీ ఫుడ్స్‌పై క్రేవింగ్స్ తగ్గుతాయి వంటి విషయాలు నోటిస్ చేసి.. దాని ప్రకారం మీ డైట్‌ని ఫిక్స్ చేసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మీకు ఈ విషయంలో డౌట్ ఉంటే ఆరోగ్య నిపుణులు లేదా డైటీషియన్తో మీ అలవాట్లను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి డైట్ ప్లాన్ చేయించుకోండి.