Haryana: ఎన్నికల్లో ఓడిపోతే ఇంత మర్యాదలా.. కోట్ల నగదు, కారు గిఫ్ట్
సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి సానుభూతి చూపడం తప్ప గ్రామస్థులు కానీ రాజకీయనేతలుకు కానీ ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవు. కాగా హర్యానా రాష్ట్రంలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకొన్నది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి రోహతక్ జిల్లాలోని చిరి గ్రామస్థులు భారీ బహుమతులు అందజేశారు. అంతగా అతను ఏం చేశారు. ఎందుకు అతనిని ప్రజలు అంతగా ఆదరిస్తున్నారో చూసేద్దామా..
Haryana: సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి సానుభూతి చూపడం తప్ప గ్రామస్థులు కానీ రాజకీయనేతలుకు కానీ ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవు. కాగా హర్యానా రాష్ట్రంలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకొన్నది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి రోహతక్ జిల్లాలోని చిరి గ్రామస్థులు భారీ బహుమతులు అందజేశారు. అంతగా అతను ఏం చేశారు. ఎందుకు అతనిని ప్రజలు అంతగా ఆదరిస్తున్నారో చూసేద్దామా..
నవంబర్ 12న చిరి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఎన్నికల్లో ధర్మపాల్ అలియాస్ కాలా 66 ఓట్ల తేడాతో నవీన్ దలాల్ అనే అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే, అతడు ఓటమిబాధతో నిరాశలో కూరుకుపోకుండా ఊరు ఊరంతా ధర్మపాల్ కు మద్దతుగా నిలిచింది. ఓటమి బాధను పోగట్టి అతడిని ముఖంలో సంతోషం చూడడానికి ఊరంతా కలిసి ఎస్యూవీ కారు, రూ. 2.11 కోట్ల నగదును అందజేసింది. దానితో ధర్మపాల్ ఆనందంలో మునిగితేలాడు. తనకు మద్ధతుగా నిలిచిన తన గ్రామప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని ధర్మపాల్ పేర్కొన్నారు.
ధర్మపాల్ ఇదివరకు లఖన్ మజ్రా బ్లాక్ సమితి ఛైర్మన్‌గా పనిచేయగా, అతని తల్లి మరియు తాత చిరి గ్రామ సర్పంచ్‌లుగా ప్రజలకు సేవచేశారు. గ్రామస్థుల అపూర్వ ఆదరణ ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఎలా ఓడిపోయారని కొందరు అతన్ని ప్రశ్నించగా.. గెలుపు ఓటములు జీవితంలో భాగమని, అయితే తోటి గ్రామస్తులు ఇచ్చిన బలం కారణంగా తానే విజేతననే భావన కలిగించిందని అన్నారు. నన్ను ఓడించి సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి పట్ల నాకు ఎలాంటి బాధ లేదని, గ్రామాభివృద్ధికి తనవంతు సహకరిస్తానని ధర్మపాల్ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదల