Parliament Winter Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదల
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు ఉభయ సభల శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

Parliament Winter Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు ఉభయ సభల శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
శీతాకాల సమావేశాల్లో మొత్తం 17 పనిదినాలు ఉండనున్నాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, అంశాలపై చర్చ జరుగనుందని ఆయన వెల్లడించారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ఎగువ సభలో కార్యకలాపాలను నిర్వహించే మొదటి సెషన్ ఇది కావడం గమనార్హం. కాగా, పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ఈ నెల 21వ తేదీన ప్రీ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆధ్వర్యంలో 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీకి సూచనలు కోరుతూ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: తిహార్ జైల్లో మంత్రికి మసాజ్.. వీడియో వైరల్