Last Updated:

Upcoming Movies and Web Series : ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమా, వెబ్ సిరీస్ లు..

ప్రేక్షకులను అలరించడానికి వరుసగా ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం సమ్మర్ బరిలో సుమారు 21 సినిమాలు ఈ సారి ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇందులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ పలు డబ్బింగ్‌ మూవీస్‌ ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీసుల వివరాలు మీకోసం ప్రత్యేకంగా.. 

Upcoming Movies and Web Series : ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమా, వెబ్ సిరీస్ లు..

Upcoming Movies and Web Series : ప్రేక్షకులను అలరించడానికి వరుసగా ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం సమ్మర్ బరిలో సుమారు 21 సినిమాలు ఈ సారి ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇందులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ పలు డబ్బింగ్‌ మూవీస్‌ ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీసుల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్ లో రిలీజ్ కానున్న సినిమాలు..

రవితేజ “రావణాసుర”.. 

మాస్‌ మహరాజ్ రవితేజ ఈ ఏడాది చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే ఊపులో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, దక్షా నగర్కర్‌, పూజిత పొన్నాడా, ఫరియా అబ్ధుల్లా హీరోయిన్స్ గా చేస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్‌లలో విడుదల కానుంది.

కిరణ్ అబ్బవరం “మీటర్‌”.. 

యువ కథా నాయకుడు కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నారు. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ ప్రేక్షకుల పలకరించిన ఆయన ఇప్పుడు ‘మీటర్‌’తో వస్తున్నారు. పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తుంది. రమేశ్‌ కాడూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్య రవి హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా కూడా ఏప్రిల్‌ 7న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆగస్టు 16, 1947.. 

దేశభక్తి నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఆర్‌.మురుగదాస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఆగస్టు 16, 1947’. ఎన్‌.ఎస్‌ పొన్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం రాగా, ఆ మరుసటి రోజు ఏం జరిగింది? అనే కాన్సెప్ట్ తో మూవీ వస్తుంది. గౌతమ్‌ కార్తిక్‌, రిచర్డ్‌ ఆస్టన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 7న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు/సిరీస్ లు (Upcoming Movies and Web Series)..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

ద క్రాస్ ఓవర్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 4

రోమాంచమ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 7

టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 9

నెట్ ఫ్లిక్స్..

బీఫ్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 6

ఇన్ రియల్ లవ్ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 6

చుపా (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 7

ఓహ్ బెలిండా (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 7

ట్రాన్స్ అట్లాంటిక్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 7

హంగర్ (థాయ్ సినిమా) – ఏప్రిల్ 8

ఆహా..

బుర్ఖా (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 7

అమెజాన్ ప్రైమ్..

జూబ్లీ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 7

జీ5..

అయోతి (తమిళ సినిమా) – ఏప్రిల్ 7

బుక్ మై షో..

బాబీలోన్ (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 5

బ్యాట్ మ్యాన్: ద డూమ్ దట్ కేమ్ టూ గోతమ్ (ఇంగ్లిష్ సినిమా) – ఏప్రిల్ 5

కాస్మోస్ (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 7

ద పెంబ్రోక్ షైర్ మర్డర్స్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 7

హోయ్ చోయ్..

బ్యోంకేష్ ఓ పిరంజల్ (బెంగాలీ సిరీస్) – ఏప్రిల్ 7

డాక్యూ బే..

హిస్టరీ 360 – రోమ్ (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 8

హిస్టరీ 360 – గ్రీస్ (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 9