Last Updated:

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..?

ప్రతి వారం థియేటర్లలో, ఓటిటీ లో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అక్టోబర్  మొదటి వారం లో కూడా పలు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ వారం విడుదలయ్యే చిత్రాలను గమనిస్తే అన్ని యంగ్ హీరోల చిత్రాలే ఉండడం గమనార్హం. అదే విధంగా ఈ వారం ఓటీటీలో కూడా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..?

Upcoming Releases : ప్రతి వారం థియేటర్లలో, ఓటిటీ లో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అక్టోబర్  మొదటి వారం లో కూడా పలు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ వారం విడుదలయ్యే చిత్రాలను గమనిస్తే అన్ని యంగ్ హీరోల చిత్రాలే ఉండడం గమనార్హం. అదే విధంగా ఈ వారం ఓటీటీలో కూడా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఏకంగా 29 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తెలుగు, హిందీతోపాటు మిగతా భాషల్లోనూ అనేక లు, వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో అక్టోబర్ కి వెల్కమ్ చెప్పేస్తూ రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు..

మామ మశ్చీంద్ర.. 

ప్రముఖ హీరో సుధీర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన పాత్రలు చేసి నటుడిగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ బాబు. ప్రముఖ నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్‌ హీరోగా చేసిన మూవీ “మామ మశ్చీంద్ర”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి నారాయణ దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, టైలర్ మూవీపై అంచనాలను క్రియేట్ చేయడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాలి.

Sudheer Babu's Mama Mascheendra Movie

రూల్స్‌ రంజన్‌..

టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసపెట్టి మూవీస్ చేస్తున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డిజే టిల్లు ఫేమ్ “నేహాశెట్టి”తో కలిసి నటించిన చిత్రం “రూల్స్‌ రంజన్‌”. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మాతలుగా చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rules Ranjan

మంత్‌ ఆఫ్‌ మధు..

నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’. ఈ సినిమా అక్టోబరు 6న విడుదల కానుంది. ఎమోషనల్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.

మ్యాడ్‌..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌.. సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో వస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ “మ్యాడ్‌”. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ  ఇంజినీరింగ్‌ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు తెలుస్తుంది. అక్టోబరు 6న థియేటర్‌లలో ఈ చిత్రం విడుదల కానుంది.

ముత్తయ్య మురళీధరన్‌ “800”.. 

ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ అందరికీ సుపరిచితులే. ఆయన జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. మురళీ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ నటించగా, ఆయన భార్య మదిమలర్‌ పాత్రలో మహిమా నంబియార్‌ నటించారు. ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకత్వంలో.. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో అక్టోబరు 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, సింహళీ భాషల్లో విడుదలవుతోంది. టెస్ట్‌ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

800

చిన్నా..

హీరో సిద్దార్థ్.. బాయ్స్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి ఎన్నో చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు. తాజాగా హీరో సిద్దార్థ్ నటించిన తమిళ సినిమా ‘చిత్తా’. సెప్టెంబర్ 28న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ‘చిన్నా’ పేరుతో అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంజలీ నాయర్‌, నిమిష సజయన్‌ కీలక పాత్రల్లో ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ రూపొందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో చూడాలి.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్..

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. తెలుగు.. అక్టోబర్ 5

ఖుఫియా.. హిందీ.. అక్టోబర్ 5

ఇన్సీడియష్: ద రెడ్ డోర్.. ఇంగ్లీష్.. అక్టోబర్ 6

బెక్‌హమ్.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. అక్టోబర్ 4.

రేస్ టూ ద సమ్మిట్.. జర్మన్.. అక్టోబర్ 4.

ఎవ్రిథింగ్ నౌ.. ఇంగ్లీష్.. అక్టోబర్ 5.

లూపిన్ పార్ట్ 3.. ఇంగ్లీష్.. అక్టోబర్ 5

ఏ డెడ్లీ ఇన్విటేషన్.. స్పానిష్.. అక్టోబర్ 6

బల్లేరినా.. కొరియన్ మూవీ.. అక్టోబర్ 6

స్ట్రాంగ్ గర్ల్ నామ్ సూన్.. కొరియన్.. అక్టోబర్ 7

సిస్టర్ డెత్.. ఇంగ్లీష్.. అక్టోబర్ 5 స్ట్రీమింగ్ కానున్నాయి..

అమెజాన్ ప్రైమ్..

ముంబయి డైరీస్ సీజన్ 2.. హిందీ సిరీస్.. అక్టోబరు 6

టోటల్లీ కిల్లర్.. ఇంగ్లీష్ .. అక్టోబరు 6

డెస్పరేట్లీ సీకింగ్ సోల్‌మేట్.. ఇంగ్లీష్ సిరీస్.. అక్టోబరు 6 న స్ట్రీమింగ్ కానున్నాయి..

హాట్ స్టార్..

సీజన్ 2.. ఇంగ్లీష్ సిరీస్.. అక్టోబరు 6

హాంటెడ్ మ‍్యాన్షన్.. ఇంగ్లీష్ .. అక్టోబరు 4న స్ట్రీమింగ్ కానున్నాయి..

ఆహా..

మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ (తెలుగు) అక్టోబరు 6

ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌ (తెలుగు) అక్టోబరు 6

The Great Indian Suicide

బుక్ మై షో..

ఆస్టరాయిడ్ సిటీ.. ఇంగ్లీష్ చిత్రం.. అక్టోబరు 06

ద నన్ 2.. ఇంగ్లీష్ .. అక్టోబరు 03

గ్రాన్ టరిష్మో.. ఇంగ్లీష్ మూవీ.. అక్టోబరు 05.. స్ట్రీమింగ్ కానున్నాయి.. ఇక మరో వారం ఇంకా ఎక్కువ సినిమాలు విడుదల కానున్నాయి..

జీ5..

గదర్ 2.. హిందీ.. అక్టోబర్ 6.

జియో ..

మెయిన్ మహ్మమూద్.. హిందీ.. అక్టోబర్ 3

గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్.. హిందీ షార్ట్ ఫిల్మ్.. అక్టోబరు 6

ద డాటర్.. హిందీ షార్ట్ ఫిల్మ్.. అక్టోబరు 7

ర్యాట్ ఇన్ ద కిచెన్.. హిందీ షార్ట్ ఫిల్మ్.. అక్టోబరు 2 స్ట్రీమింగ్ కానున్నాయి

సినీ బజార్..

నీ వెంటే నేను.. తెలుగు.. అక్టోబర్ 6.

డిస్కవరీ ప్లస్..

స్టార్ వర్సెస్ ఫుడ్ సర్వైవల్.. హిందీ.. అక్టోబర్ 6 న స్త్రీమింగ్ కానుంది..