KA Movie: కిరణ్ అబ్బవరంకు అక్కడ చేదు అనుభవం – ‘క’ పాన్ ఇండియా రిలీజ్‌కు అడ్డంకులు, కేవలం తెలుగులోనే..
KA Movie Release only in Telugu: పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి బ్రేక్ పడింది. మూవీ రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులు ఉండగా చేదు వార్త చెప్పింది మూవీ టీం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’ మూవీ. దర్శక ద్వయం సుజిత్, సందీప్‌ల దర్శకత్వంలో పీరియాడికల్ థ్రీల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.
తన్వీ రాయ్, నయని సారిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దీపావళికి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది మూవీ టీం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలోనూ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటన కూడా ఇచ్చేసింది. అయితే హిందీలో కాస్తా లేటుగా రిలీజ్ చేస్తున్నామని, అక్టోబర్ 31న తెలుగు, తమిళ్, మలయాళంలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది ‘క’ టీం. ఇక ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్‌లోనే మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితమే ‘క’ ట్రైలర్‌ని రిలీజ్చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ప్రెస్‌మీట్ పెట్టి ప్రత్యేకంగా మీడియా కోసం ‘క’ ట్రైలర్‌ని ప్రదర్శించారు. అనంతరం కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ.. ట్రైలర్‌కి మంచి రెస్సాన్స్ వస్తుందని సంతోషం వ్యక్తం చేశాడు. అయితే అక్టోబర్ 31న ‘క’ కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నామని ప్రకటించాడు. ‘క’ సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలనుకున్నాం. ఇదోక మంచి సినిమా, ఇంతవరకు ఎన్నడూ చూడని కథ ఇది. మలయాళం మా సినిమాను హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.
అక్కడ ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆయనే. అయితే ఆయన నటించిన ‘లక్కీ భాస్కర్’ కూడా అక్టోబర్ 31నే విడుదల అవుతుండటంతో ‘క’ సినిమాను రిలీజ్ చేయడం కదురడం లేదు. దీంతో మలయాళం ఈ సినిమా వాయిదా పడింది. ఇక తమిళంలో ‘క’ సినిమాకు థియేటర్లు దొరకకపోవడంతో అక్కడ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదని స్పష్టం చేశాడు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వాల్సిన ‘క’ కేవలం తెలుగులో మాత్రం రిలీజ్ చేస్తున్నామని చెప్పాడు.