Last Updated:

Governor Tamilisai: రాష్ట్ర ప్రభుత్వం నన్ను అవమానించింది.. తమిళసై సంచలన వ్యాఖ్యలు!

రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్​ అన్నారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో నేడు ఆమె ప్రసంగించారు.

Governor Tamilisai: రాష్ట్ర ప్రభుత్వం నన్ను అవమానించింది.. తమిళసై సంచలన వ్యాఖ్యలు!

Hyderabad: రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్​ అన్నారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో నేడు ఆమె ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు గౌరవం ఇవ్వకపోయినా తన పని తను చేసుకుంటూ పోతానని తమిళసై చెప్పారు. గత మూడేళ్లుగా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి ఇబ్బందులు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మేడారం జాతర సందర్భంలో తాను జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్‌ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై స్పందించలేదని, రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించి సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లానని తమిళి సై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తనకు ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వడం లేదని తమిళ సై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని విషయాలు బయటకు చెప్పకపోవడమే మంచిదని ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యానించారు​. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తాను ఎళ్లవేళలా పనిచేస్తానని తెలిపారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని, కానీ రాజ్‌భవన్‌ను గౌరవించాలని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి: