Harirama Jogaiah: తెలంగాణలో కేసీఆర్‌కు పట్టే గతే ఏపీలో జగన్ కు పడుతుంది..
తెలంగాణాలో ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరి రామజోగయ్య స్పందించారు. వివిధ సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మొదటి నుంచి కాంగ్రెస్ దూకుడుగా ఉందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌కు పట్టే గతే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు పట్టబోతుందని జోగయ్య జోస్యం చెప్పారు.

Harirama Jogaiah:: తెలంగాణాలో ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరి రామజోగయ్య స్పందించారు. వివిధ సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మొదటి నుంచి కాంగ్రెస్ దూకుడుగా ఉందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌కు పట్టే గతే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు పట్టబోతుందని జోగయ్య జోస్యం చెప్పారు.
పరాకాష్టకి చేరిన కేసీఆర్ అవినీతి..( Harirama Jogaiah)
కర్ణాటకలో అనూహ్యంగా బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఈ దూకుడు కనిపిస్తోందని అన్నారు.పదేళ్ల పరిపాలనలో కేసీఆర్ అవినీతి పరాకాష్టకి చేరిందని. అలాగే కేసీఆర్ పథకాలు అందరికీ అందలేదని విమర్శించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలంగాణలో ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. జనసేన, టీడీపీ కూటమిలో కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటే వైసీపీ కూలడం సాధ్యమని హరిరామ జోగయ్య తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- Telangana Voter Turnout: తెలంగాణలో 64.14 శాతం పోలింగ్ నమోదు
- Anju Returned: ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాకిస్తాన్ వెళ్లి.. భారత్ కు తిరిగి వచ్చిన అంజు