Last Updated:

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్‌రెడ్డి

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్‌ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.

Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్‌రెడ్డి

Revanth Reddy: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్‌ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.

నేతల సమక్షంలోనే..(Revanth Reddy)

సీఎల్పీ నేత ఎంపికపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సోమవారం హైదరాబాద్ లోని గచ్చిబౌలి హోటల్లో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసారు. ఈ తీర్మానాన్ని డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ కు పంపారు. అయితే తరువాత డీకే శివకుమార్ రమ్మంటూ కాంగ్రెస్ హైకమాండ్ పిలవడంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. మరోవైపు సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో సుదీర్గంగా చర్చలు జరిపారు.దీనితో పార్టీ సీఎం ఎంపికపై ఆలస్యం చేస్తోందంటూ పార్టీ శ్రేణులు అసంతృప్తికి లోనయ్యాయి. అయితే చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోపాటు మిగిలిన నేతలు చర్చించి రేవంత్ రెడ్డి పేరును కన్ ఫర్మ్ చేసారు. ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ డీకే, భట్టి, ఉత్తమ్ ల సమక్షంలోనే ప్రకటించారు. పార్టీలో సీనియర్ నేతలందరికీ సముచిత ప్రాధాన్యం ఉంటుందని, అందరి ప్రయోజనాలు కాపాడతామని తెలిపారు. ఇలా ఉండగా రేవంత్ రెడ్డిని ఢిల్లీ రమ్మంటూ కాంగ్రెస్ హైకమాండ్ కబురు పెట్టడంతో ఆయన ఢిల్లీ బయలు దేరారు. క్యాబినెట్ కూర్పు, శాఖల పంపిణీపై పార్టీ అగ్రనేతలతో ఆయన చర్చించే అవకాశముంది. అదేసమయంలో సోనియా, రాహుల్, ప్రియాంకలను కూడా తన ప్రమాణ స్వీకారానికి పిలిచే అవకాశముంది. మొత్తంమీద తెలంగాణ సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ తొలగిపోయింది

ఇలాఉండగా సీఎల్పీ నేతగా ఎంపిక కావడానికి ముందే రేవంత్ రెడ్డి తుఫాను నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్ చేసారు. ఆయన ఇంటివద్ద కూడా అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను పెంచింది.