MI Vs RR : భారీ టార్గెట్ ని ఈజీగా ఛేజ్ చేసి విక్టరీ కొట్టిన ముంబై ఇండియన్స్.. జైస్వాల్ సెంచరీ వృథా !
ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో, ముంబై ఇండియన్స్ తలపడింది. కాగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ ని చిత్తు చేసన ముంబై సూపర్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్నిముంబై జట్టు 19.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
MI Vs RR : ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో, ముంబై ఇండియన్స్ తలపడింది. కాగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ ని చిత్తు చేసన ముంబై సూపర్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్నిముంబై జట్టు 19.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ గమనిస్తే ఓపెనర్లు రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (28: 23 బంతుల్లో 4×4) మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బర్త్ డే సందర్భంగా మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకున్న రోహిత్ శర్మ.. ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు. తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్ (26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు 44 పరుగులు) చేసి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. అలానే మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా (29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు 55 పరుగులు)
అయితే స్కోరు 152 వద్ద సూర్య ఔటైపోవడంతో ముంబై విజయానికి చివరి 24 బంతుల్లో 57 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో క్రీజులో నిలిచిన తిలక్ వర్మ (29 నాటౌట్: 21 బంతుల్లో 3×4, 1×6), టిమ్ డేవిడ్ (45 నాటౌట్: 14 బంతుల్లో 2×4, 5×6) జోడి రాజస్థాన్ బౌలర్లపై ఎదురు దాడి చేశారు. ఐదో వికెట్‌కి అజేయంగా 62 పరుగుల భాగస్వామ్యం చేసింది ఈ జంట. విజయానికి చివరి 6 బంతుల్లో 17 పరుగులుఅవసరం అయ్యాయి. ఈ దశలో హోల్డర్ వేసిన లాస్ట్ ఓవర్లో తొలి మూడు బంతుల్ని టిమ్ డేవిడ్ సిక్సర్లుగా మలిచేశాడు. దాంతో 19.3 ఓవర్లలోనే 214/4తో లక్ష్యాన్ని పూర్తి చేసింది. రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ పడగొట్టారు.
There’s only one Tim David, THERE’S ONLY ONE TIM DAVIDDDD! 🥹🔥#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #MIvRR #TATAIPLpic.twitter.com/0lEIwz5smj
— Mumbai Indians (@mipaltan) April 30, 2023
అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124; 62 16 ఫోర్లు, 8 సిక్సర్లు) ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ 53 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు జైస్వాల్ మాత్రం దూకుడు కొనసాగించడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. మిగిలిన వారిలో బట్లర్ 18, శాంసన్ 14, హోల్డర్ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, పీయూష్ చావ్లా రెండు, జోఫ్రా ఆర్చర్, రిలే మెరెడిత్ లు ఒక్కొ వికెట్ తీశారు. ఇక ఈ సీజన్‌లో 8వ మ్యాచ్ ఆడిన ముంబైకి ఇది నాలుగో విజయం కాగా.. 9వ మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది నాలుగో ఓటమి. అలానే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 3 వ ప్లేస్ లో.. ముంబై 7 వ స్థానంలో ఉన్నాయి.