Surya As Rolex : పదేళ్ళు నేను సెటిల్… సూర్య ” రోలెక్స్ ” మూవీ అప్పుడే అంటున్న లోకేష్ కనగరాజ్ !
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది అని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీల పత్రాలు పోషించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను రాబడుతూ భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల మోత మోగించింది.
Surya As Rolex : కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది అని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీల పత్రాలు పోషించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను రాబడుతూ భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల మోత మోగించింది. అయితే ఈ సినిమాలో తన గత చిత్రం ‘ఖైదీ’ కి సంబంధించిన పలు సీన్లను కూడా ఉంచి… రెండు సినిమాలకు కలిపి ఒక మల్టీవర్స్ క్రియేట్ చేశాడు లోకేష్. దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచిందని చెప్పొచ్చు.
ముఖ్యంగా విక్రమ్ సినిమాలో డ్రగ్ మాఫియా డాన్ లాగా కనిపించాడు సూర్య. క్లైమాక్స్‌లో ఆయన కనిపించింది కొద్ది సేపే అయినా… తన పర్మార్మెన్స్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడని చెప్పాలి. దీంతో ఈ మూవీ తర్వాత ‘ఖైదీ2’ ఉంటుందని అందరూ ఆశించారు. అన్నదమ్ములైన సూర్య, కార్తి కలిసి వెండితెరపై ఒకే చిత్రంలో కనిపిస్తే అభిమానులకు పండగ వాతావరణంలా ఉంటుంది. ఈ చిత్రం కోసమే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రస్తుతం విజయ్‌తో ఓ మూవీ చేస్తున్నాడు లోకేష్. ఇది కూడా లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ మూవీ కావడంతో విజయ్‌ను ఏ పాత్రలో చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌హాసన్‌తో కలిసి పాల్గొన్నారు లోకేష్. ఈ సంధర్భంగా తన నెక్స్ట్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా రోలెక్స్ పాత్రతో సింగిల్ మూవీ చేయనున్నట్లు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు లోకేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నా. దీని తర్వాత కమల్‌హాసన్ సర్‌తో కూర్చొని మాట్లాడతా. ఆ తర్వాత ‘ఖైదీ2’ మొదలు పెడతా. అది పూర్తయిన వెంటనే ‘విక్రమ్’ సీక్వెల్ ఉంటుంది. అంతే కాదు రోలెక్స్ పాత్ర నేపథ్యంలో మూవీ కూడా ఉంటుంది. అది ప్రీక్వెల్ లేదా సీక్వెల్ కూడా అవ్వవచ్చు. పరిస్థితులను బట్టి ఈ చిత్రాలు అటూ ఇటూ కావచ్చు. ఇది మల్టీ యూనివర్స్. దీంతో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను అని అన్నారు. వచ్చే పదేళ్ల వరకూ నేను సెటిల్ అని చెబుతూ సరదాగా వ్యాఖ్యానించారు.
కాగా ఇప్పుడు ఈ వార్తతో సూర్య అభిమానుల్లో మరింత జోష్ నెలకొంది. విక్రమ్ లో సూర్య డైలాగ్ ” సింహం వేటాడేటప్పుడు అడవి ప్రకాశంగా ఉంటుందట. అప్పుడది ఆకలితో ఉన్నప్పుడు.. అడవి కూడా పస్తు ఉండాలి. 27ఏళ్లు అయింది ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి, వాడు.. వాడి బాబు ఊరికే ఇచ్చింది కాదు’ అని చెప్తారు. దీంతో ఆ 27 ఏళ్లలో డ్రగ్ మాఫియా డాన్ ఎలా అయ్యాడో చూపించే అవకాశం ఉందంటూ సూర్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
Probably #Rolex ah 😳 @Dir_Lokesh pic.twitter.com/YmDIbXC6gw
— Suriya42 (@suryafansfamily) December 13, 2022
” We Need to See #Rolex Back “
@Dir_Lokesh @Suriya_offl pic.twitter.com/sBSydBpGBB
— Kerala Suriya Fans – KSF ™ (@KSF_Offl) December 12, 2022