Published On:

Kamal Haasan: శ్రీరాముడిని కాదు ఆయన తండ్రిని ఫాలో అవుతా – రెండు పెళ్లిళ్ల ప్రశ్నపై కమల్‌ రియాక్షన్‌

Kamal Haasan: శ్రీరాముడిని కాదు ఆయన తండ్రిని ఫాలో అవుతా – రెండు పెళ్లిళ్ల ప్రశ్నపై కమల్‌ రియాక్షన్‌

Kamal Haasan Says He is Being Judged For Marrying Twice: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌ లైఫ్‌’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జూన్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ సినిమాలో పెళ్లి పాటను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా మూవీ టీం ప్రెస్‌మీట్‌ నిర్వహించి మీడియాతో ముచ్చటించింది.

 

ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న త్రిష, శింభులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి త్రిష ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చి అందరికి షాకిచ్చింది. తనకు పెళ్లిపై నమ్మకం లేదని తెలిపింది. అనంతరం తనకు పెళ్లయినా, కాకపోయినా ఫర్వాలేదని తెల్చేసింది. ఆ తర్వాత కమల్‌ హాసన్‌ మధ్యలో మాట్లాడుతూ గతంలో తనకు ఎదురైన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఏంపీ బ్రిట్టాస్‌, నేను మంచి స్నేహితులం. 15 ఏళ్ల క్రితం మేమిద్దరం ఓ కాలేజీ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా వెళ్లాం. అప్పుడు కాలేజీ విద్యార్థులంతా మా చూట్టూ ఉన్నారు.

 

అదే టైంలో బ్రిట్టాస్‌ నన్నో ప్రశ్న అడిగారు. నువ్వు మంచి బ్రహ్మణ కుటుంబం నుంచి వచ్చావు. కానీ, ఎందుకు రెండు పెళ్లిళ్లు చేసుకున్నావ్‌ అని అడిగారు. ఆ వెంటనే నేను అసలు మంచి కుటుంబానికి, పెళ్లికి సంబంధం ఏంటి? అని అడిగాను. నువ్వు రాముడిని పూజిస్తావ్‌.. మరి ఆయనలాగే జీవించాలి కదా అని అన్నారు. అప్పుడు నేను ఇలా అన్నాను. ‘నేను ఏ దేవుడిని ప్రార్థించను. రాముడి అడుగుజాడల్లో అసలే నడవను. బదులుగా రాముడి తండ్రి (దశరథుడు ముగ్గురు భార్యలు) బాటలో నడుస్తాను’ అని సమాధానం ఇచ్చాను అని చెప్పుకొచ్చాను అని ఆయన చమత్కిరించారు. ఇక ఆయన కామెంట్స్‌కి అక్కడ ఉన్నవారంత కాసేపు సరదాగా నవ్వుకున్నారు.

 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా కమల్‌ హాసన్‌ 1978లో హీరోయిన్‌ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల పాటు ఆమె జీవించిన కమల్‌ ఆ తర్వాత విడాకులు ఇచ్చారు. అదే ఏడాది 1978లోనే సారికను (శ్రుతి హాసన్‌ తల్లి) రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి 1986లో శ్రుతి హాసన్‌ జన్మించింది. ఆ తర్వాత 1991లో అక్షర హాసన్‌ పట్టింది. కొంతకాలం అన్యోన్యంగా ఉన్న వీరు 2002లో విడిపోయి విడివిడిగా జీవించారు. 2004లో వీరికి విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత నటి గౌతమితో కమల్‌ హాసన్‌ కొన్నేళ్లు సహాజీవనం చేశాడు. 2016లో ఆమెతో కూడా విడిపోయిన సంగతి తెలిసిందే.