Gujarat: గుజరాత్ తొలి విడత పోలింగ్ ప్రారంభం
గుజరాత్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో నిలచున్నారు.
Gujarat: గుజరాత్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో నిలచున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం ఎన్నికల సంఘం 14,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.
గుజరాత్ లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా గెలిచి తన స్థానాన్ని సుస్థిరంగా నిలబెట్టుకోవాలని చూస్తుండగా ఈసారి
ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ అనుకుంటుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం వంటి వాటిని ప్రచారాస్త్రాలుగా మలచుకుని పంజాబ్‌లో మాదిరిగా ఇక్కడ కూడా ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకుంటుంది.
ఇదీ చదవండి: ఎన్నికల విరాళాలలో బీజేపీదే అగ్రస్దానం..