Mlc Elections Results : పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు నిదర్శనమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు – గంటా శ్రీనివాసరావ్
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు.
Mlc Elections Results : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు. ఈ ఒరవడి వచ్చే ఎన్నికలకు నాంది అని.. 2024లో టీడీపీదే విజయన్నారు గంటా. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను విజయపథాన నిలిపిన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- TSPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు.. మరో తేదీ ప్రకటన
- Airtel 5G data offer: సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చిన ఎయిర్ టెల్..