Last Updated:

Airtel 5G data offer: సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చిన ఎయిర్ టెల్..

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన యూజర్ల కోసం 5జీ అపరమిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది.

Airtel 5G data offer: సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చిన ఎయిర్ టెల్..

Airtel 5G data offer: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన యూజర్ల కోసం 5జీ అపరమిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది. అధిక మొత్తంతో రీఛార్జ్‌ చేసుకునే వినియోగదారులను

ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. మరో కంపెనీ రిలయన్స్‌ జియో ఇటీవలే జియో ప్లస్‌ పేరిట పోస్ట్‌పెయిడ్‌ ఫ్యామిలీ ప్యాక్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

 

పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లందరికీ..(Airtel 5G data offer)

ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన ఈ అన్ లిమిటెడ్ డేటా ఇంట్రడక్టరీ ఆఫర్‌ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది.

అలాగే రూ. 239, అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న ప్రీపెయిడ్‌ యూజర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ ఆఫర్ ను పొందాలంటే.. 5జీని సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉండాలి.

కస్టమర్లు రోజువారీ డేటా పరిమితి గురించి ఆలోచించకుండా ఇంటర్నెట్‌ను ఎంజాయ్‌ చేయడంతో పాటు..

ఆన్‌లైన్‌ సేవల్ని పొందాలనే లక్ష్యంతోనే ఈ ప్రవేశ ఆఫర్‌ను తీసుకొస్తున్నామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌తో తమ కస్టమర్లు అత్యంత వేగవంతమైన, అపరిమిత డేటాను ఆనందిస్తారని ఆశిస్తున్నామని తెలిపింది.

 

విస్తరించేందుకు ఎయిర్ టెల్ ప్లాన్

ఈ ఆఫర్ ను పొందాలంటే.. ఎయిర్‌టెల్‌ (Airtel 5G data) థ్యాంక్స్‌ యాప్‌లోకి వెళ్లి అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా ఆఫర్‌ను పొందొచ్చు.

ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ సేవలు దేశవ్యాప్తంగా 270 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని ప్రాంతాలకూ 5 జీ సేవలను విస్తరించేందకు ఎయిర్‌టెల్‌ ప్లాన్ చేస్తోంది. మరో వైపు 2024 మార్చి నాటికి అన్ని నగరాల్లో విడుదల చేస్తామని ఎయిర్టెల్ ప్రకటించింది.