Last Updated:

Facial Recognition in Airports : దేశంలోని మూడు విమానాశ్రయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ ఎంట్రీ

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ తో సహా దేశంలోని మూడు విమానాశ్రయాల్లో డిజి యాత్ర పేపర్‌లెస్ ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

Facial Recognition in Airports : దేశంలోని మూడు విమానాశ్రయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ ఎంట్రీ

Delhi: ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ తో సహా దేశంలోని మూడు విమానాశ్రయాల్లో డిజి యాత్ర పేపర్‌లెస్ ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనిని గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టి) ఆధారంగా, డిజి యాత్ర విమానాశ్రయాలలో ప్రయాణీకులకు కాంటాక్ట్‌లెస్ ప్రాసెసింగ్‌ను జరుగుతుంది.దీనితో, విమానాశ్రయంలోని వివిధ చెక్‌పాయింట్ల వద్ద ప్రయాణీకుల డేటా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడుతుంది.ప్రస్తుతానికి ఢిల్లీతో పాటు, ఇది బెంగళూరు మరియు వారణాసి విమానాశ్రయాలలో అందుబాటులో ఉంటుంది. మార్చి 2023 నాటికి, మరో నాలుగు నగరాల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్, కోల్‌కతా, పూణే మరియు విజయవాడ విమానశ్రయాల్లో దీనిని విస్తరిస్తారు.

గూగుల్ ప్లే స్టోర్ లేదా iOS యాప్ స్టోర్ నుండి డిజియాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, ప్రయాణీకులు పేరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ మరియు గుర్తింపు పత్రం (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID మొదలైనవి) వంటి వివరాలను నమోదు చేస్తే డిజి యాత్ర ID వస్తుంది.టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు దాన్ని షేర్ చేయాలి. ఎయిర్‌లైన్ కంపెనీలు, ఈ ID మరియు ప్రయాణీకుల డేటాను బయలుదేరే విమానాశ్రయంతో పంచుకుంటాయి.విమానాశ్రయం ఇ-గేట్ వద్ద, బార్-కోడెడ్ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయాలి.అక్కడ ఇన్‌స్టాల్ చేయబడిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ మీ గుర్తింపును, అలాగే ప్రయాణ పత్రాన్ని ధృవీకరిస్తుంది. దీని తర్వాత, మీరు లోపలికి వెళ్లి సెక్యూరిటీ చెక్ అయ్యాక విమానం ఎక్కవచ్చు.

ఇవి కూడా చదవండి: