Last Updated:

Lucky Bhaskar OTT: ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ – ఐదు భాషల్లో స్ట్రీమింగ్‌

Lucky Bhaskar OTT: ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ – ఐదు భాషల్లో స్ట్రీమింగ్‌

Lucky Bhaskar Now Streaming on This OTT: రీసెంట్‌ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. దీపావళి సందర్భంగా థియేటర్లోకి వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. అందులో దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’ భారీ విజయం సాధించింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం డిజిటల్‌ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ విడుదలై నెల రోజులు అవుతున్న ఇప్పటికి థియేటర్లో ఆడుతూనే ఉంది. అయినా ఈ సినిమాను డిజిటల్‌ ప్రీమియర్‌కి ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. మూవీ రిలీజ్‌కు ముందే లక్కీ భాస్కర్‌ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

చెప్పినట్టు ఈ రోజు నుంచి ఓటీటీలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం లక్కీ భాస్కర్‌ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో పాటు తమిళ్‌, మలయాల, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం మరోసారి లక్కీ భాస్కర్‌ను ఓటీటీ చూసి ఎంజాయ్‌ చేయండి. అక్టోబర్‌ 31న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా రూ. 100 కోట్లపైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిని ఈ సినిమాలో గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఓ సాధారణ బ్యాంక్‌ ఉద్యోగి వందకోట్ల అధిపతి ఎలా అయ్యాడు అనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కింది.

కథేంటంటే..

1989-92 మధ్య ముంబై బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథ ఇది. భాస్కర్‌ కుమార్‌(దుల్కర్‌ సల్మాన్‌) మధ్యతరగతికి చెందిన సాధారణ బ్యాంక్‌ ఉద్యోగి. బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేసే అతడి నిండా అప్పులే. ప్రమోషన్‌ వస్తే తన బాధలు తీరతాయి ఆశగా ఎదుచూస్తుంటాడు. కానీ ఎంత కష్టపడ్డ ప్రమోషన్స్‌ తనకి కాకుండా వేరే వాళ్లకు వెళుతుంది. దీంతో డబ్బు కోసం ఆంటోనీ అనే వ్యక్తితో కలిసి చిన్న స్కాంలు చేయడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇది ఆపేస్తాడు. అయితే అనుకోకుండ అతడు కోట్లకు అధిపతి అవుతాడు. బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ అవుతాడు. అంత డబ్బు ఎలా సంపాదించాడు. అతడు చేసిన స్కాంను సీబీఐ గుర్తించిందా? దీని నుంచి అతడు ఎలా బయటపడతాడు అనేది ‘లక్కీ భాస్కర్‌’ కథ.