Bandi Sanjay: 2014కి ముందు కేసీఆర్ ఆస్తులెన్ని.. అధికారంలోకి వచ్చాక ఆస్తులెన్ని?- బండి సంజయ్
Bandi Sanjay: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ తన అసమర్ధ పాలనతో దివాళా తీయించారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఆస్తులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో 9 అంశాలపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి భాజపా కీలక నేతలు.. ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం పలు విమర్శలు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. మిగులు బడ్జెట్ ఉంటే.. ప్రస్తుతం రాష్ట్రం దివాళా తీసే పరిస్థితిలో ఉందన్నారు. కేవలం మద్యం ద్వారా.. ఒక్కో కుటుంబం ఏటా రూ.50 వేల ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇస్తే.. కేసీఆర్ మాత్రం.. ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపారని అన్నారు.
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. తెలంగాణ మాత్రం కేసీఆర్ పాలనలో అప్పుల రాష్ట్రంగా తయారైందని సంజయ్ అన్నారు.
కేసీఆర్ కుటుంబంపైన, టీఆర్ఎస్ నేతల అవినీతిపై ప్రజల్లో ఎంతటి తీవ్ర వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా వెల్లడైందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో
5 విడతల పాదయాత్ర పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రజా సంగ్రామ యాత్ర దేశానికి స్పూర్తిగా నిలిచిందని మోదీ కితాబు ఇచ్చారని ఈ సందర్భంగా బండి సంజయ్ (Bandi sanjay) చెప్పారు.
తెరాస పాలనతో విసుగుచెందిన ప్రజలు భాజపాపై విశ్వాసంతో ఉన్నారని బండి సంజయ్ తెలిపారు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది భాజపాతోనే సాధ్యమని అన్నారు.
ఏ ఆశయం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో… అవి నెరవేరాలంటే భాజపా అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ అన్ని వర్గాలను అణిచివేస్తున్నారు.. తెరాస పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఈ సమావేశంలో తీర్మానించారు.
ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్కటి నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు.
ఇప్పటి వరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ పుట్టిన రోజునాడు సచివాలయాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
సచివాలయం సొమ్ము ప్రజలదని.. అంబేద్కర్ జయంతి నాడు సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ రాష్ట్ర ప్రజలను.. రైతులను.. నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. పోడు భూముల సమస్యను గాలికొదిలేశాడని ఆరోపించారు.
రాష్ట్రంలో నైజాం పాలన సాగుతోందని.. కేసీఆర్ తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/