Published On:

Vivo X200 FE Features Leaks: దీన్ని కొట్టేది లేదా.. మార్కెట్లోకి Vivo X200 FE.. అంచనాలు పెంచేస్తున్న లీక్స్!

Vivo X200 FE Features Leaks: దీన్ని కొట్టేది లేదా.. మార్కెట్లోకి Vivo X200 FE.. అంచనాలు పెంచేస్తున్న లీక్స్!

Vivo X200 FE Features Leaked: టెక్ కంపెనీ వివో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. బ్రాండ్ Vivo X200 FE భారతదేశంలో BIS సర్టిఫికేషన్ పొందింది. ఇది కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అవుతుందని, ఇది డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌తో భారత మార్కెట్‌కు రావచ్చని అనేక నివేదికలు పేర్కొన్నాయి. ఇది వచ్చే వారం చైనాలో లాంచ్ కానున్న Vivo S30 Pro Mini రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇది గతంలో అనేక ఇతర సర్టిఫికేషన్లను కూడా పొందింది. అంటే ఇది భారతదేశంతో సహా ఇతర దేశాలలో విడుదల అవుతుందని సూచిస్తుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

 

Vivo X200 FE BIS Listing

ఎక్స్‌పర్ట్‌పిక్ ప్రకారం.. కొత్త వివో ఫోన్ మోడల్ నంబర్ V2503తో జాబితా చేశారు. ఇది ఇప్పటికే మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలలో సర్టిఫికేషన్ ప్రక్రియను ఆమోదించింది. ఈ తుది మార్కెటింగ్ పేరు Vivo X200 FE అని నిర్ధారిస్తుంది. దురదృష్టవశాత్తు BIS సర్టిఫికేషన్ స్పెసిఫికేషన్ల గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ అన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి.

 

Vivo X200 FE Specifications

నివేదికల ప్రకారం.. Vivo X200 FE స్మార్ట్‌ఫోన్ 6.31-అంగుళాల LTPO ఓఎల్ఈడీ స్క్రీన్‌‌తో వస్తున్న కాంపాక్ట్ ఫోన్, ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌ను దీనిలో ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ ఫోన్‌కు 6,500mAh బ్యాటరీ ఇవ్వవచ్చు, దీన్ని ఛార్జ్ చేయడానికి 90W ఛార్జింగ్ సపోర్ట్ పొందచ్చ. ఇది 12GB+256GB, 16GB+256GB స్టోరేజ్‌తో సహా రెండు ఎంపికలలో రావచ్చు.

 

Vivo X200 FE లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో సోనీ IMX882 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అదే సమయంలో, సెల్ఫీల కోసం ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇన్‌స్టాల్ చేయచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 పై రన్ కావచ్చు. ఇది మూడు సంవత్సరాల పాటు OS అప్‌గ్రేడ్‌లను అందుకుంటుందని భావిస్తున్నారు.

 

Vivo X200 FE Price

ధర రూ. 50,000 నుండి రూ. 60,000 మధ్య ఉండవచ్చని అంచనా. రాబోయే OnePlus 13s తో పోటీ పడే అవకాశం ఉంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ ఉంటుంది, జూన్ 5న భారతీయ మార్కెట్లోకి వస్తుందని అంచనాలు చెబుతున్నాయి.