Last Updated:

Russia Airstrike: ఉక్రెయిన్ పిల్లల ఆసుపత్రిపై రష్యా వైమానిక దాడి.. 20 మంది మృతి.

ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో పిల్లల ఆసుపత్రిపై రష్యా చేసిన భారీ వైమానిక దాడలో 20 మంది మరణించారు. సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్‌లో జరిగిన మరో దాడిలో కనీసం 10 మంది మరణించారు. ఈ దాడి గత కొద్దినెలలుగా జరగుుతున్న దాడుల్లో అతిపెద్దదాడిగా చెప్పవచ్చు.

Russia Airstrike: ఉక్రెయిన్ పిల్లల ఆసుపత్రిపై రష్యా వైమానిక దాడి.. 20 మంది మృతి.

Russia Airstrike: ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో పిల్లల ఆసుపత్రిపై రష్యా చేసిన భారీ వైమానిక దాడలో 20 మంది మరణించారు. సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్‌లో జరిగిన మరో దాడిలో కనీసం 10 మంది మరణించారు. ఈ దాడి గత కొద్దినెలలుగా జరగుుతున్న దాడుల్లో అతిపెద్దదాడిగా చెప్పవచ్చు.

దాడితో పిల్లల ఆసుపత్రిలో రెండంతస్తుల భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఆస్పత్రిలోని ప్రధాన 10 అంతస్తుల భవనంపై కిటికీలు, తలుపులు ఊడిపోయి గోడలు నల్లబడ్డాయి.వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు శిథిలాలను తరలించడానికి సహాయం చేసారు, వారు కింద చిక్కుకున్న పిల్లలు మరియు వైద్య సిబ్బంది కోసం వెతికారు. వాలంటీర్లు, అత్యవసర సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్ మాట్లాడుతూ, నగర వీధుల్లో చాలా మంది ప్రజలు ఉన్న సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. దాడి పరిణామాలపై అధికారిక అంచనాలు ఇంకా కొనసాగుతున్నాయని కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు.

కింజాల్ క్షిపణులు..(Russia Airstrike)

రష్యాకు చెందిన అత్యంత అధునాతన ఆయుధాలలో కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. కింజాల్ ధ్వని కంటే 10 రెట్లు వేగంతో ఎగురుతుంది, అడ్డగించడం కష్టతరం చేస్తుంది. పేలుళ్ల ధాటికి నగర భవనాలు దద్దరిల్లాయి. వివిధ రకాలైన 40కి పైగా క్షిపణులతో రష్యా ఐదు నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. చిల్డ్రన్స్ హాస్పిటల్‌పై రష్యా దాడిని జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యా యొక్క దురాగతాలను గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

 

ఇవి కూడా చదవండి: