Published On:

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులు.. 11 మందికి పైగా మృతి

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులు.. 11 మందికి పైగా మృతి

Russian Drone Attack on Ukraine’s Odesa: రష్యా, ఉక్రెయిన్ మరోసారి పరస్పర దాడులు చేసుకున్నాయి. ఒకవైపు ఇరు దేశాల మధ్య శాంతి కుదిర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగా.. తాజాగా, రెండు దేశాలు దాడులు చోటుచేసుకున్నాయి. మాస్కో దిశగా కీవ్ డ్రోన్లను ప్రయోగించింది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. ఈ క్షిపణి దాడిలో దాదాపు 11 మందికి పైగా మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

 

కాగా, రష్యా రాజధాని మాస్కోను టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. మొత్తం 91డ్రోన్లు మాస్కోను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడింది. ఈ దాడిలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విమానాశ్రయాలను మూసివేయడంతో పాటు పలు విమానాలను దారి మళ్లించినట్లు రష్యన్ అధికారులు వెల్లడించారు.

 

ఈ దాడిలో రష్యాపై ప్రయోగించిన 337 ఉక్రెయిన్ డ్రోన్లు కూలిపోయాయని, ఇందులో 91 మాస్కో, 126 కుర్స్క్ ప్రాంతంపై కనిపించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉక్రెయిన్ దళాలు వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధికారుల బృందం సౌదీ అరేబియాలో అమెరికన్ బృందంతో సిద్ధమవుతోంది, ఈ సమయంలో తెల్లవారుజామను ఈ భారీ డ్రోన్ జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది.