Last Updated:

Rishi Sunak : రిషి సునాక్ @ 100 డేస్

బ్రిటన్‌ ప్రధానమంత్రిగా రిషి సునాక్‌ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు.గడ్డు పరిస్థితుల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పే అని చెప్పవచ్చు.

Rishi Sunak : రిషి సునాక్ @ 100 డేస్

Rishi Sunak :  బ్రిటన్‌ ప్రధానమంత్రిగా రిషి సునాక్‌ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు.

గడ్డు పరిస్థితుల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పే అని చెప్పవచ్చు.

సునాక్‌ కంటే ముందు ప్రధానమంత్రిగా పనిచేసిన లిజ్‌ ట్రస్‌ కేవలం 49 రోజులు మాత్రమే

ప్రధానిగా పనిచేసి పార్టీ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడికి తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్లిపోయారు.

వంద రోజుల్లో  పలు సవాళ్లను ఎదుర్కొన్న రిషి సునాక్ ..

అయితే ఈ వంద రోజుల్లో రిషి సునాక్  పలు సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది.

బ్రిటన్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వరంగానికి చెందిన సిబ్బంది రోడ్లపైకి వచ్చి సమ్మె దిగారు.

పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టు వేతనాలు పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

సమ్మెబాటలో ఐదులక్షలమంది ఉద్యోగులు..

ఈ వారంలోనే దేశంలోని ఐదు లక్షల మంది ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి సమ్మె బాట పట్టారు.

స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలతో పాటు రైల్వే నెట్‌వర్కు ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

దేశంలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ కూడా కుప్పకూలేస్థాయికి చేరుకుంది.

పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో దేశంలోని లక్షలాది మంది ప్రజలు

పూటగడవక ఇబ్బందులు పడుతున్నారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా జీ7 దేశాల్లో బ్రిటన్‌ ఒక్కటే ఈ ఏడాది

వృద్దిరేటులో వెనుకబడి పోతుందని తేల్చి చెప్పింది.

మంత్రులను తొలగించిన రిషి సునాక్ ..

మరోవైపు తన పార్టీకి చెందిన మంత్రులను బలవంతంగా తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నాదీమి జవాహి మినిస్టీరియల్‌ కోడ్‌ ఉల్లంఘించినందుకు ఆయనను

మంత్రి వర్గం నుంచి తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆదాయపు పన్ను ఉల్లంఘించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

దీనితో ఆయన ఆదాయపు పన్ను అధికారులకు 5.96 మిలియన్‌ డాలర్ల పెనాల్టీ కట్టాల్సి వచ్చింది.

ప్రస్తుతం కన్సర్వేటివ్‌ పార్టీ రేటింగ్‌ మాత్రం దారుణంగా పడిపోయింది.

వచ్చే ఏడాది అంటే 2024లో బ్రిటన్‌ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి.

అయితే అధికార కన్సర్వేటివ్‌ పార్టీతో పోల్చుకుంటే ప్రతిపక్ష

లేబర్‌ పార్టీకి అవకాశాలు మెరుగుపడుతున్నాయి.

ప్రస్తుతం సునాక్‌పై ఉన్న గురుతర బాధ్యత ఏమటంటే వచ్చే ఎన్నికల్లో

భారీ ఓటమి పొందకుండా గౌరవప్రదమైన సీట్లు సాధిస్తే

అదే గొప్ప అన్నట్లుంది ప్రస్తుతం పరిస్థితి.

ఇదిలా ఉండగా రిషి సునాక్‌ తన ‍ప్రధాని పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని పదవి కత్తిమీద సామన్న రిషి సునాక్ ..

ఈ ఉద్యోగం తనకు కత్తిమీద సాములాంటిదే అయినా దీన్ని తన

కర్తవ్యంగా భావించి సమర్ధవంతంగా పూర్తి చేస్తానని చెప్పారు.

భారత సంతతి వ్యక్తిగా ఈ పదవిని చేపట్టి సరిగ్గా వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా

రిషి సునాక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఈ బాధ్యతలను చాలా వైవిధ్యంగా

పూర్తి చేయగలనని ధీమా వ్యక్తం చేశారు. హిందూమతంలో ఉన్న ‘ధర్మం’ అనే భావన తనకు

ప్రేరణ అని, అదే ఈ పదవిని తన కర్తవ్యంగా మారుస్తుందని చెప్పారు.

ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి ప్రస్తావించగా..

నర్సులకు ఎక్కువ వేతనాలు ఇవ్వాలి.. రిషి సునాక్

తాను నర్సులకు భారీ వేతనం పెంచేందుకు ఇష్టపడతానని చెప్పారు.

కానీ అలా చేస్తే ద్రవ్యోల్బణం పెరుతుందని అందువల్ల

తాను వేతనాలు పెంచలేనని చేతులెత్తేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జనాదరణ పొందకపోయినా పర్వాలేదు..

కానీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా

దేశానికి దిశా నిర్దేశం చేయడమే కీలమైన చర్య అని సునాక్‌

తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/