Chennai Love Story Glimpse: ‘బేబీ’ డైరెక్టర్‌తో కిరణ్ అబ్బవరం సినిమా – ఆసక్తిగా చెన్నై లవ్‌స్టోరీ గ్లింప్స్, చూశారా?
Kiran Abbavaram Chennai Love Story Movie Announced: ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కథ అందించడంతో పాటు ఆయన నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి నంబూరి దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఈ సినిమాకు చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ బాగా ఆకట్టుకుంటోంది.
దాదాపు రెండు నిమిషాలు ఉన్న ఈ వీడియోలో సినిమా స్టోరీని పరిచయం చేశారు. ఇందులో హీరోయిన్ తొలిప్రేమ ఎంత గొప్పదో చెబుతుంది. తొలిప్రేమలో ఉండే అనుభూతిని హీరోకి చెబుతుంది. ఈ వీడియో బీచ్ ఒడ్డున హీరోహీరోయిన్లు కుర్చున్నట్టు చూపిస్తారు. ప్రారంభంలోనే హీరోయిన్ బేబీ మూవీ చూశావా? అంటూ హీరోని అడుగుతుంది. దానికి అతడు చూశాను అని సమాధానం ఇస్తాడు. “అలా మొదటి ప్రేమకు మరణం లేదు.. అది మనసు లోతుల్లో శాశ్వతంగా సమాది చేయబడుతుంది.. ఫస్ట్ లవ్ అదోకసారి ఫెయిల్ అయితే నరకం.. మొదటి ప్రేమలో ఒక ప్యూరిటీ.. నిజాయితీ ఉంటుంది” తొలిప్రేమ గురించి హీరోయిన్ గొప్పగా చెబుతుంది.
కానీ హీరో మాత్రం తొలిప్రేమ అంత తోపేం కాదు అన్నట్టు ఉంటాడు. మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే.. అందరి కథలు అమ్మప్రేమ దగ్గరే ఆగిపోవాలి కదా అంటాడు. అమ్మ ప్రేమే కదా.. తొలిప్రేమ. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయ్యిందంటే.. బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందని అని అంటాడు. ఒకేచోట కదలకుండ కూర్చుంటే కాలు కూడా తిమ్మిరెక్కుతుంది. మనసు కూడా అంతే.. ఒకసారి కదిపి చూడండి మెల్లగా అడుగులేస్తూ.. అదే పరిగేడుతుంది అంటాడు. ప్రేమపై విభిన్న అభిప్రాయాలతో ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనేది ‘చెన్నై లవ్ స్టోరీ’. మరో కల్ట్ క్లాసికల్ లవ్‌స్టోరీ లోడింగ్ అంటూ ఈ మూవీపై అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం చెన్నై లవ్‌స్టోరీ గ్లింప్స్ బాగా ఆకట్టుకుంది. చూస్తుంటే ఇదో అందమైన కల్ట్, క్లాసిక్ లవ్‌స్టోరీ అనిపిస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి వివరాలను ప్రకటించనున్నారు.