Andhra Pradesh: రాష్ట్రంలో పచ్చదనం పెరగాలి, 5కోట్ల మొక్కలకు శ్రీకారం: సీఎం చంద్రబాబు
Andhra Pradesh: రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములవ్వాలని కావాలని సీఎం సూచించారు.
విద్యాసంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇది గతేడాది 29 శాతం వరకు గ్రీన్ కవర్ ఉందని, ఈ ఏడాదికి 30.5 శాతానికి పెరిగిందని సీఎం అన్నారు. ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంతంతో సహా రాష్ట్రంలో పచ్చదనం 2033 నాటికి 37 శాతానికి, 2047కి 50 శాతానికి చేరుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు.
ప్రతి ఏడాది కనీసం 1.5 శాతం మేర గ్రీన్ కవర్ పెరగాలన్నారు. సీఆర్డీఏ పరిధిలో ఫారెస్ట్‌తో కలిపి ఎంత గ్రీన్ కవర్ ఉందో స్పష్టమైన సమాచారం శాటిలైట్ల సాయంతో సేకరించాలని, అలాగే ప్రతీ మొక్కను ట్యాగ్ చేయాలన్నారు.