Google Pixel 10 Series: ఇదెక్కడి మాస్ రా మావా.. గూగుల్ నుంచి అదిరే ఫోన్లు.. రాస్కో హిట్ పక్కా..!

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రానుంది. కంపెనీ తన రాబోయే ఫ్లాగ్షిప్ సిరీస్ లాంచ్ తేదీని టీజ్ చేసింది. గత సంవత్సరం విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఈ అప్‌గ్రేడ్ మోడల్లో నాలుగు ఫోన్లు కూడా ఉండవచ్చు, వీటిలో స్టాండర్డ్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో,పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్,పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఉన్నాయి. ఈ సిరీస్ కొత్త టెన్సర్ G5 ప్రాసెసర్‌తో సహా అనేక శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది.
ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం, గూగుల్ ఈ సిరీస్‌ను ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించవచ్చు. దీనిని జూన్ చివరి వారంలో ప్రవేశపెట్టవచ్చు. గూగుల్ పంపిన ఆహ్వానంలో, ఈ సిరీస్ ప్రారంభ తేదీ జూన్ 27 అని వెల్లడించింది. పిక్సెల్ సూపర్ అభిమానుల కోసం జూన్ 27న గూగుల్ పిక్సెల్ పెన్హౌస్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలోనే పిక్సెల్ 10 సిరీస్‌లోని అన్ని మోడళ్లను విడుదల చేయచ్చు. అయితే, ఈ ఈవెంట్ ఇన్విటేషన్లో గూగుల్ పిక్సెల్ 10 పేరును నేరుగా ప్రస్తావించలేదు.
గత సంవత్సరం, గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్‌ను ఆగస్టులో ప్రవేశపెట్టింది. అటువంటి పరిస్థితిలో, గూగుల్ రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ షెడ్యూల్ చేసిన సమయానికి చాలా ముందుగానే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఎల్లో, పర్పుల్, బ్లాక్,గ్రీన్, గ్రే, పింగాణీ వైట్ కలర్లో లభిస్తుంది. ఈ సిరీస్‌ను ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల కావచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 లైనప్‌లో అనేక రకాల AI ఫీచర్లు కనిపిస్తాయి. ఈ కొత్త సిరీస్ పిక్సెల్ సెన్స్ వంటి AI ఫీచర్లతో రావచ్చు. నివేదిక ప్రకారం, పిక్సెల్ సెన్స్ వినియోగదారులకు గూగుల్ క్యాలెండర్, క్రోమ్, ఫైల్స్, జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ కీప్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ మెసేజ్‌లు, గూగుల్ ఫోటోలు, గూగుల్ వాలెట్, ఫోన్, రికార్డర్, యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్, వంటి గూగుల్ యాప్‌ల నుండి సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందిస్తుంది. గూగుల్ ఈ AI అసిస్టెంట్ కోడ్ నేమ్ ఆరేలియస్, ఇది ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంటుంది.