New York: న్యూయర్స్ లో దీపావళికి సెలవు.. పాఠశాలలకు హాలిడే ప్రకటన
New York: హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి చాలా ప్రత్యేకం. అందులోని భారతీయుల చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే విదేశాల్లో ఈ పండుగకు అంత ప్రాధాన్యత లేదు.
New York: హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి చాలా ప్రత్యేకం. అందులోని భారతీయుల చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే విదేశాల్లో ఈ పండుగకు అంత ప్రాధాన్యత లేదు. కానీ ఇప్పుడు ఎందెందు వెతికినా అందు నేనుందును అన్నట్టు విశ్వవ్యాప్తంగా భారతీయులు ఉన్నారు. అమెరికాలో భారతీయులు మరియు తెలుగువాళ్లు ఎక్కువగా ఉండడం ప్రతి ఏడాది వారు అక్కడే ఈ పండుగను అట్టహాసంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఇండియన్స్ ఎంతో ఘనంగా జరుపుకునే ఈ దీపావళి పండుగకు న్యూయార్క్ ప్రభుత్వం ప్రాధాన్యతను కల్పించింది.
ముందుగానే దీపావళి వచ్చినట్టుంది(New York)
దీపావళి పండుగ రోజున న్యూయార్క్ లో స్కూల్స్ కు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున పాఠశాలలకు హాలిడే ప్రకటించడం చట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు తెలిపారు.
దీపావళి రోజున స్కూల్స్ కు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్ కుమార్, సంఘం నాయకులకు అండగా నిలినందుకు గర్వపడుతున్నానంటూ మేయర్ ఎరిక్ అన్నారు. చాలాకాలంగా అసెంబ్లీ సభ్యులు జెనిఫర్ రాజ్ కుమార్ ఈ సెలవు కోసం డిమాండ్ చేస్తోన్నారు. రెండు దశాబ్ధాలుగా సాగిన తన పోరాటం ఎట్టకేలకు విజయం సాధించినందుకు సంతోకరంగా ఉందని మేయర్ తెలిపారు. ఈ ప్రకటనతో దీపావళి ముందుగానే వచ్చినట్లు అయిందని ఎరిక్ పేర్కొన్నారు.