Last Updated:

PM Modi: ప్రధాని మోడీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’

PM Modi: ప్రధాని మోడీకి పలు అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు దాసోహం అయ్యాయి. గత 9 ఏళ్లుగా పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చేస్తున్న కృషికి గుర్తింపుగా అనేక దేశాలు ఈ పురస్కారాలను మోడీకి అందించాయి.

PM Modi: ప్రధాని మోడీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’

PM Modi: ప్రధాని మోడీకి పలు అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు దాసోహం అయ్యాయి. గత 9 ఏళ్లుగా పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చేస్తున్న కృషికి గుర్తింపుగా అనేక దేశాలు ఈ పురస్కారాలను మోడీకి అందించాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈజిప్టు పర్యటనలో భాగంగా మరో అత్యున్నత గౌరవం అందుకున్నారు. ఈజిప్టు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ పురస్కారాన్ని మోడీ అందుకున్నారు. ప్రస్తుతం ఈజిప్టు పర్యటనలోనే ఉన్న నరేంద్ర మోడీకి ఆదివారంనాడు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఈ పురస్కారాన్ని అందజేశారు. కాగా మోడీకి ఇప్పటివరకు ఎన్ని ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వచ్చాయో ఓసారి చూసేద్దాం.

కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు: పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు కృషి చేసినందుకు, అలాగే గ్లోబల్ సౌత్ కు నాయకత్వం వహించినందుకు గానూ పాపువా న్యూ గినియా మోడీకి కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు అనే అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది.

కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ: అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్‌ లీడర్‌గా ప్రధాని మోడీ చూపిస్తున్న చొరవకు గుర్తింపుగా ఫిజి ప్రభుత్వం ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి’ మెడల్ అందుకున్నారు మోడీ.

ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో: భూటాన్ ప్రభుత్వం ప్రధాని మోడీని డిసెంబర్ 2021లో ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ అవార్డుతో సత్కరించింది.

లెజియన్‌ ఆఫ్‌ ది మెరిట్‌: అమెరికా సైన్యం అందించే అత్యుత్తమ పురస్కారం ఇది. భారత్‌- అమెరికాల స్నేహబంధానికి గుర్తుగా 2020 డిసెంబర్‌ 22లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేతుల మీదుగా లెజియన్‌ ఆఫ్‌ ది మెరిట్‌ అవార్డు అందుకున్నారు ప్రధాని మోడీ. ఇవే కాక మరికొన్ని అవార్డులను సైతం మోడీ అందుకున్నారు.

రిపబ్లిక్ ఆఫ్ పలావ్ ‘ఎబాకల్‌’అవార్డు- రిపబ్లిక్ ఆఫ్ పలావ్- మే, 2023
ది మోస్ట్ హానరబుల్ ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్- మాల్టీవులు–జూన్‌, 2019
ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు- రష్యా – 2019
ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు- యునైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌- 2019
గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు- పాలస్తీనా- 2018
స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ – ఆఫ్గనిస్తాన్‌- 2016
ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్- సౌదీ అరేబియా- 2016
ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు- ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం- 2018
సియోల్ శాంతి బహుమతి- 2018