Iran- Israel War Ends : ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది: డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

Iran- Israel War Ends said by Trump: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీనిపై ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇరుదేశాల్లో పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి.
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ సైనిక స్థావరాలు, అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులకు ప్రతిచర్యగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ కూడా మిస్సైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో జూన్ 22న ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ఎయిర్ స్ట్రైక్ విరుచుకుపడింది. ఈ పరిణామంతో ప్రపంచమే నిర్ఘాంతపోయింది. ఇందుకు ప్రతీకారంగా.. ఇరాక్, ఖతార్ లోని అమెరికా మిలిటరీ బేస్ లపై ఇరాన్ మిస్సైల్స్ దాడులు చేసింది.
ఆపరేషన్ బేషరత్ ఫతా పేరుతో ఖతార్, ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ లపై విరుచుకుపడింది. ఖతార్ లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ ఉదీద్ పై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. అలాగే, ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ పైనా మిస్సైల్ తో అటాక్ చేసింది. అల్ ఉదీద్.. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. ఇక్కడ దాదాపు 10 వేల మంది అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ అలర్ట్ అయ్యారు. అమెరికాలోని వైట్ హౌస్ వార్ రూంలో ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. తమ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, జాతీయ భద్రతకు ముప్పు కలిగితే ఎవరినీ వదిలిపెట్టబోమని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.