Iran Close Oil Corridor: ఆయిల్ కారిడార్ మూసివేత.! ఆమోదించిన ఇరాన్ పార్లమెంట్..!

Iran parliament: గత కొన్ని రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నడుస్తున్న యుద్ధం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ఇన్ని రోజుల వరకు ఇజ్రాయెల్ దేశానికి పరోక్షంగా మద్దతుగా నిలిచిన అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది. ఇరాన్‌పై దాడులు చేసింది. ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయిల్ కారిడార్‌ను మూసివేయాలని నిర్ణయించుకుంది. ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నీటి మార్గాన్ని మూసి వేయనుంది. ఇందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
హార్మోజ్ జలసంధి మార్గం గుండానే 5 శాతం మేర ప్రపంచ దేశాలకు ఆయిల్, గ్యాస్ సరఫరా అవుతుంది. అరేబియా మహా సముద్రంతో పాటు హిందూ మహా సముద్రాన్ని కలుపుకుని ఈ మార్గం ఉంది. ఈ నీటి మార్గం 33 కిలోమీటర్ల వెడల్పుతో.. ఇరాన్, అరేబియన్ పెనుసులా దేశాల మధ్యలో ఉంటుంది. అయితే, ఆ మార్గం ద్వారా ఆయిల్ షిప్ చేసే లైన్లు చాలా సన్నగా ఉంటాయి. అవి కేవలం 3 కిలోమీటర్ల వెడల్పుతో మాత్రమే ఉంటాయి. ఈ లైన్ల ద్వారా దాడులు చేయటం చాలా సులభం ఉంటుంది. ఈ కారణంగానే ఇరాన్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ను మూసి వేయాలని ఇరాన్ నిశ్చయించుకుంది.
ఈ మార్గం ద్వారానే సౌదీ అరేబియా, ఇరాక్, ది యూఏఈ, ఖతర్, ఇరాన్, కువైట్ దేశాలు ఆయిల్‌ను ఎగుమతి చేస్తూ ఉన్నాయి. ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. ఈ మార్గం ద్వారా ప్రతీ రోజు 2 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఇండియాకు దిగుమతి అవుతూ ఉంటుంది. దీన్ని మూసివేసినా పెద్దగా ఇబ్బంది లేదని పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. రష్యా, అమెరికా, బ్రెజిల్ నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని అంటున్నారు.