Published On:

Jagannath Rath Yatra: జగన్నాథుని వెంట భారీగా తరలిన భక్తులు

Jagannath Rath Yatra: జగన్నాథుని వెంట భారీగా తరలిన భక్తులు

Puri Jagannath Rath Yatra: ఎంతో ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రలో పాల్గొంనేందుకు దేశంతో పాటు, విదేశాల నుంచి కూడా జగన్నాథ భక్తులు పెద్ద సంఖ్యలో పూరీకి తరలివచ్చారు. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసింది. జై జగన్నాథ్ నినాదాలతో పూరీ సిటీ మార్మోగిపోతోంది. జగన్నాథుని రథం వెంబడి నడుస్తూ వారి భక్తిని చాటుకుంటున్నారు.

ముందుగా అందంగా తయారుచేసిన కొత్త రథాలపై సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుని మూలమూర్తులను కొలువుతీర్చారు. అనంతరం ఆలయానికి సంబంధించిన రాజు బంగారు చీపురుతో ఊడ్చి.. కస్తూరి నీళ్లు చల్లారు. అనంతరం భక్తుల జగన్నాథ నామస్మరణ మధ్య రథయాత్ర ప్రారంభమైంది. కాగా రథయాత్రలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నట్టుగా అధికారులు అంచనా వేశారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి సుభద్ర, బలభద్రుడు సమేతంగా జగన్నాథుడు రథయాత్రగా వెళ్లనున్నారు. అక్కడ వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఆలయానికి తిరిగి వస్తారు. దీంతో లక్షలాది మంది భక్తులు జగన్నాథుని వెంట గుండీచా ఆలయానికి వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి: