Published On:

Seethakka: మావోయిస్టుల లేఖ‌పై స్పందించిన మంత్రి సీత‌క్క‌.. ఒక మ‌హిళ‌ను ప‌ట్టుకుని అలా?

Seethakka: మావోయిస్టుల లేఖ‌పై స్పందించిన మంత్రి సీత‌క్క‌.. ఒక మ‌హిళ‌ను ప‌ట్టుకుని అలా?

Minister Seethakka Respond Maoist Letter: మావోయిస్టుల లేఖ‌పై స్పందించిన మంత్రి సీత‌క్క‌ స్పందించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మీడియాతో మంత్రి సీత‌క్క‌ మాట్లాడారు. ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదన్నారు. అయితే ఆ లేఖ‌లో లేని అంశాల‌పై ఒక రాజ‌కీయ‌ పార్టీ ప‌త్రిక‌లు, మీడియా సంస్థ‌లు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయన్నారు.

 

మహిళ అని చూడ‌కుండా అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడుతూ త‌మ రాజ‌కీయ క‌క్ష‌ను తీర్చుకుంటున్నాయని చెప్పారు. మ‌హిళ‌పై అస‌భ్య ప‌ద‌జాలాన్ని వినియోగించ‌డం ఆవేద‌న క‌లిగిస్తోందన్నారు. ఒక మ‌హిళ‌ను ప‌ట్టుకుని సిగ్గులేదా అని రాయ‌డం ఏం జ‌ర్న‌లిజం అని ప్రశ్నించారు. నేను ఎన్నడూ ప్రజలకు దూరంగా లేను.. వారంలో రెండు మూడు రోజులు ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానట్లు వివరించారు.

 

గత ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో శక్తులు పని చేశాయని, కానీ అవే శ‌క్తులు ఇప్పుడు న‌న్ను టార్గెట్ చేస్తున్నాయని వెల్లడించారు. ఒక కోయ మ‌హిళ‌ల‌కు జ‌న‌ర‌ల్ పోర్ట్ ఫోలియో ద‌క్క‌డాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేక‌పోతోందన్నారు. 75 ఏళ్లల్లో మొదటిసారిగా ఒక కోయ మహిళకు జనరల్ పదవి వస్తే స‌హించ‌లేక‌పోతున్నారన్నారు. నా వ్యక్తి గ‌త ప్ర‌తిష్ట‌ను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని వివరించారు.

 

జీవో 49తో అడబి బిడ్డ‌లు న‌ష్ట‌పోతార‌ని, ఆ జీవోను వ్య‌తిరేకించానన్నారు. మా జీవితాలకు గొడ్డలి పెట్టు లాంటి జీవోను ర‌ద్దు చేయాల‌ని కోరినట్లు చెప్పారు. గిరిజ‌న సంక్షేమ మంత్రి కాకున్నా.. పార్టీల‌కు అతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలంద‌రితో స‌మావేశ‌మై జీవో 49 ను ర‌ద్దు చేయాల‌ని తీర్మాణించామన్నారు. ఏ హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా నేను ఆదివాసి అడ‌వి బిడ్డ‌నే అని తేల్చి చెప్పారు.

 

అడవి బిడ్డల సంక్షేమం, అభివృద్ది కోస‌మే నా జీవితం అంకితమన్నారు. ఆదివాసీలు, అణ‌గారిన వ‌ర్గాల కోసం విపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులకు మేలు చేసేలా అధికారాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. అడ‌వి బిడ్డ‌ల ప‌ట్ల‌ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నామన్నారు.

 

ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఘ‌ట‌న‌లు మా దృష్టి రాగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో, ప్రిన్స్ ప‌ల్ చీఫ్ కన్సర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్, పీసీసీఎఫ్ సువ‌ర్ణతో స్వ‌యంగా మాట్లాడినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని హ‌మీ ఇచ్చారు

ఇవి కూడా చదవండి: