Iran- Israel War Started: మళ్లీ మొదలైన ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం!

Again started Iran- Israel War after Ceasefire: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఆగిపోయిన యుద్ధం మళ్లీ మొదలయ్యేలా ఉంది. గత 12 రోజులుగా ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధం తన వల్లే ఆగిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. దాదాపు నాలుగు గంటలపాటు ఇరు దేశాల్లో ప్రశాంతత నెలకొంది. యుద్ధం ముగిసిందని ప్రజలంతా ఆనందపడుతున్న సమయంలో ఇరుదేశాల మధ్య యుద్ధం మళ్లీ మొదలైంది.
కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత ఇరాన్ నుంచి భారీ స్థాయిలో మిస్సైల్ దాడులు జరిగాయని, ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో దాడులను గుర్తించినట్టు రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. ఉత్తర భూభాగంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ఒప్పందం తర్వాత ఇరాన్ నుంచే మిస్సైల్స్ దాడులు జరిగాయని చెప్పారు. ఇరాన్ కాల్పుల విరమణను బ్రేక్ చేసినందుకు తీవ్రంగా స్పందించాలని ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. టెహ్రాన్ సిటీని టార్గెట్ చేసుకుని దాడులు చేయాలన్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల లక్ష్యంగా దాడులు చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి స్మోట్రిచ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇరాన్ నుంచి వచ్చిన మిస్సైల్స్ ను గుర్తించామన్నారు. ఇక ఇప్పుడు టెహ్రాన్ షేక్ అవుతుందని తెలిపారు.