Published On:

Iran- Israel War: యుద్దం ఆగిందని ట్రంప్ ప్రకటన.. ఆగలేదన్న ఇరాన్!

Iran- Israel War: యుద్దం ఆగిందని ట్రంప్ ప్రకటన.. ఆగలేదన్న ఇరాన్!

Iran Statement on Iran- Israel War: ఇరాన్ పై యుద్ధాన్ని ప్రారంభిచింది ఇజ్రాయెల్, ముందు వాళ్లు దాడులు ఆపితే తామూ నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిందని, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించారు. ఆఖరి నిమిషం వరకు తమ సైన్యం ఇజ్రాయెల్ తో పోరాడుతూనే ఉందని చెప్పారు. అయితే యుద్ధం కొనసాగించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు.

 

‘ఇరాన్ పై యుద్ధం ప్రారంభించిందే ఇజ్రాయెల్. మొదట వారు దాడులు ఆపితే తాము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేశాం. ఇప్పటివరకు కాల్పుల విరమణ, సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. అయితే ఇరాన్ ప్రజలపై ఉదయం 4 గంటలలోపు ఇజ్రాయెల్ దాడులు ఆపితే, ఆ తర్వాత ప్రతిదాడులు చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు ధైర్యంగా పోరాడుతున్న సైనిక బలగాలకు ఇరాన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను’.

 

ఇవి కూడా చదవండి: