Published On:

Elon Musk: ముగ్గురు పిల్లలను కనండి.. సంతానంపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Elon Musk: ముగ్గురు పిల్లలను కనండి.. సంతానంపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Elon Musk’s advice to parents Need to have 3 kids:  ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికా దేశంలో జననాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అధిక జనాభా ఎన్విరాన్ మెంట్‌కు హాని కలుగుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఇందులో భాగంగానే దేశంలో జననాల రేటు తగ్గకుండా ఉండాలంటే.. కనీసం ముగ్గురికి జన్మనివ్వాలని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

 

కాగా, ప్రపంచంలోని అన్ని దేశాల్లో జనాభాస్థాయిలను నిలబెట్టేందుకు మహిళలు ముగ్గురు పిల్లలను కనాలని ఫార్చ్యూన్ నివేదికను ఉటంకిస్తూ.. మస్ఖ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, జపాన్, ఇటలీ వంటి దేశాల్లో ఏడాదికి జననాల రేటు తగ్గుతూ వస్తోంది. దీనిని నివారించేందుకు ముగ్గురు పిల్లలు కనాల్సిందేనని చెబుతున్నారు. ఇలానే జననాల రేటు తగ్గితే నాగరికత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నేను చెప్పిన మాటలు మరో 20 ఏళ్లు వేచి చూస్తే కాని తెలియదని మస్క్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: