Benjamin Netanyahu on Ceasefire: ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం: ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ

Benjamin Netanyahu Accepted Ceasefire between Iran vs Israel war: ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ పేర్కొన్నారు. ఎటువంటి అతిక్రమణ జరిగినా మళ్లీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతామని చెప్పారు. 12 రోజులుగా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య భీకర వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్‌లో ఉన్న న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి తర్వాత రెండుదేశాల మధ్య కాల్పుల విమరణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం దీనిపై ప్రటకన చేసింది. కేబినెట్, రక్షణ మంత్రి, ఐడీఎఫ్ చీఫ్, మొసాద్ అధినేతతోపాటు కీలక నేతలను ప్రధాని నెతన్యహూ చర్చించారని, ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యాలను అందుకున్నట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. న్యూక్లియర్, బాలిస్టిక్ మిస్సైళ్ల నుంచి పొంచి ఉన్న ప్రమాదం పోయిందని ఇజ్రాయిల్ చెప్పింది.
ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా ఐడీఎఫ్ ఆధీనంలో తీసుకున్నట్లు చెప్పారు. ఇరాన్‌లో కీలక టార్గెట్లపై అటాక్ చేశామని తెలిపారు. ఇరాన్ సైనిక నేతలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలిపారు. తమకు సపోర్టు ఇచ్చినందుకు, అణు భయాన్ని తొలగించినందుకు అమెరికాకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యాలు నెరవేరిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహకారం మేరకే ద్వైపాక్షిక సీజ్‌ఫైర్‌కు అంగీకరించామని ఇజ్రాయిల్ పీఎంవో తెలిపింది.