Published On:

American Airlines: గాల్లో ఉండగా విమానంలో పొగ, మంటలు..!

American Airlines: గాల్లో ఉండగా విమానంలో పొగ, మంటలు..!

Smoke and Fire in American Airlines Flight: అమెరికాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో విమానం ఇంజిన్ నుంచి పొగ, మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నిన్న ఉదయం లాస్ వేగాస్ ఎయిర్ పోర్ట్ నుంచి నార్త కరోలినాకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికి సమస్య తలెత్తింది. గాల్లో ఉండగానే ఇంజిన్ నుంచి పొగ, మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పైలట్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ కు సమాచారమిచ్చారు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి లాస్ వేగాస్ ఎయిర్ పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఘటనతో అంతా భయాందోళన చెందారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

ఇవి కూడా చదవండి: