Published On:

Israel On Iran War: కాల్పుల విరమణ జరిగినా బాంబులు వేసిన ఇరాన్.. బదులిస్తామన్న ఇజ్రాయిల్

Israel On Iran War: కాల్పుల విరమణ జరిగినా బాంబులు వేసిన ఇరాన్.. బదులిస్తామన్న ఇజ్రాయిల్

Israel On Iran War: ఇరాన్- ఇజ్రాయెల్‌ మధ్య 12 రోజులుగా జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాజాగా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అవగాహన కుదిరిన కొన్ని గంటలకే ఇరాన్‌ తమపై క్షిపణులతో దాడులకు దిగిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఇరాన్‌కు గట్టిగా బదులిస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది.

ఒప్పందం కుదిరిన రెండు గంటలకే తమ గగనతలంపైకి ఇరాన్‌ నుంచి బాలిస్టిక్‌ క్షిపణులు రెండు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్‌లు మోగాయని తెలిపింది. ఆ ప్రాంతాల్లో ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై గట్టిగా స్పందించాలని ఐడీఎఫ్‌కు ఆదేశించానని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ చెప్పారు. కాల్పుల విరమణకు అంగీకరించినా.. ఇరాన్‌ నుంచి సైనిక ముప్పు పొంచి ఉందని రక్షణాధికారి ఈ దాడులకు ముందు వ్యాఖ్యానించారు. తమ వైమానిక దళాన్ని, సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్‌ హెచ్చరికలు జారీ చేసింది.

ఇరాన్- ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగనుందని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్‌ దీనిపై స్పందించిన తీరు గందరగోళానికి దారితీసింది. ఇంకా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోలేదని చెబుతూనే.. సైనిక కార్యకలాపాలు ముగిశాయని అర్థం వచ్చేలా ప్రకటన చేసింది. దీని తర్వాత ఇరుదేశాల మధ్య దాడులు జరిగాయి. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇరాన్‌ కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ కూడా ట్రంప్ ఒప్పందాన్ని అంగీకరించినట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: