Published On:

SRH won the Match: హైదరాబాద్‌తో కీలక మ్యాచ్‌.. పోరాడి ఓడిన బెంగళూరు!

SRH won the Match: హైదరాబాద్‌తో కీలక మ్యాచ్‌.. పోరాడి ఓడిన బెంగళూరు!

Sunrisers Hyderabad Won the Match against RCB in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి చెందింది. టాప్ ప్లేస్ బెర్తు కోసం బెంగళూరు ప్రయత్నించినా చివరి నిమిషంలో ఆశలపై బెంగళూరు నీళ్లు చల్లింది. ఈ మ్యాచ్ ఓటమితో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉండగా.. పంజాబ్ 17 పాయింట్లతో రన్ రేట్ ఆధారంగా రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో ఇతర మ్యాచ్‌లపై ఆధారపడాల్సి వచ్చింది.

 

తొలుత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్(17), హెడ్(17), ఇషాన్ కిషన్(94), క్లాసెన్(26), అనికేత్(26), అభినవ్(12), కమిన్స్(13), నితీశ్(4) పరుగులు చేశారు. ఇషాన్ కిషన్.. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 2 వికెట్లు పడగొట్టగా.. కృనాల్, సుయాశ్, ఎంగిడి, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు.

 

232 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు పోరాడి ఓడింది. ఓపెనర్లు కోహ్లీ(43), సాల్ట్(62) మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. హర్ష్ దూబె బౌలింగ్‌లో కోహ్లీ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సాల్ట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా కమిన్స్ చేతిలో చిక్కాడు. చివరిలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 189 పరుగులకే ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు, మలింగ్ 2, ఉనద్కత్, హర్షల్, హర్ష్ దూబె, నితీష్ కుమార్ తలో వికెట్ తీశారు.