Home / Turkey
Turkey Massive blast 12 killed in explosives factory: టర్కీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల కర్మాగారంలో మంగళవారం భారీ పేలుడు సంభవించడంతో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బాలికేసిర్ ప్రావిన్స్‌లోని కరేసి జిల్లాలో పేలుడు జరిగిందని సమాచారం. ఫ్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. టర్కీలో ఉదయం 8.25 నిమిషాలకు ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో […]
టర్కీలో తనకు తిరుగులేదని తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి నిరూపించుకున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాలుగా టర్కీ పాలకుడిగా కొనసాగుతున్న ఎర్డోగాన్.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 52 శాతం ఓట్లు సాధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది
10 Days Old Baby: ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. పెను విలయం సృష్టించిన ఈ భూకంపం.. సుమారు 25వేల మంది ప్రాణాలను బలిగొంది. భూకంపం అనంతరం.. ఎటు చూసిన కూలిన బిల్డింగులు.. శవాల దిబ్బలే కనిపించాయి.
Turkey Earthquake: ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో భూకంపం పెను విలయం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాలో భారీ భూకంపం సంభవించింది.
Turkey Earthquake: సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ మరియు ఉత్తర సిరియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. అయితే ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూకంప తీవ్రతను ముందుగానే అంచనా వేసిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
Nizam Family: హైదరాబాద్ సంస్థానాన్ని ఏళ్లపాటు నిజాం వంశస్థులు పాలించిన విషయం తెలిసిందే. ఇక నిజాం వంశంలో ఎనిమిదవ నిజాం ముఖరం ఝా బహదూర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని హైదరాబాద్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. శనివారం రాత్రి మరణించినట్లు తెలిపింది. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయనున్నట్లు నిజాం కుటుంబం ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపింది. ఎనిమిదవ నిజాం (Nizam Family) వయసు 89 సంవత్సరాలు.. […]
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాన్నే టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్‌లాల్ ఎవెన్యూలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటలో ఆరుగురు మరణించగా పదుల సంఖ్యలో ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి.
టర్కిష్ ఎయిర్‌లైన్స్ తన విమానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ రుమీసా గెల్గికి వసతి కల్పించడానికి ఆరు ఎకానమీ సీట్లను తొలగించింది.
టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 25 మంది మృతిచెందగా, 110 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. మరో 50 మంది బొగ్గుగనిలోనే చిక్కుకుపోయారు.