Published On:

Konda Murali: రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా ఉద్దేశం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

Konda Murali: రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా ఉద్దేశం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

Congress Leader Konda Murali Sensational Comments Warangal Politics: తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి వరంగల్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న పలు అంశాలపై నివేదిక సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రేపు జరగనున్న సమావేశంపై చర్చించామని, రేపు వరంగల్ నుంచి ఎంత మంది వస్తారనేది చర్చించినట్లు తెలిపారు.

 

కాంగ్రెస్ పార్టీని బతికించడం నా ఉద్దేశమని, రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా లక్ష్యమని వెల్లడించారు. పని చేసే వాళ్లపైనే రాళ్లు విసురుతారని, లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ గెలిచేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలను మళ్లా వరంగల్‌లో గెలిపించడమే నా బాధ్యత అని చెప్పుకొచ్చారు.

 

నేను ఎవరికీ భయపడేది లేదని, నేను బీసీ కార్డుపైనే బతుకుతున్నాన్నారు. రోజు 500 మంది ప్రజలకు భోజనం పెడతానని, ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందు ఉంటానన్నారు. ప్రజలు వస్తున్నారని, ఎలాంటి గ్రూప్ రాజకీయాలతో నాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

 

అలాగే నా కూతురు సుష్మిత ఎక్కడి నుండి పోటీ చేయడం లేదని, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందని కొండా సురేఖ అన్నారు. నా కూతురు అనుకునేది నాకు తెలియదని, నా కూతురు తొందర పడి అన్నదో.. ఆలోచించి అన్నదో నాకు తెలియదని వివరించారు. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకి ఉంటుందన్నారు. తన ఆలోచనను మేము కాదనలేమని, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తామన్నారు.

ఇవి కూడా చదవండి: